
కంటతడి పెట్టిస్తున్న చిరంజీవి పాట
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్150' చిత్రంలోని మరో పాటను యూట్యూబ్ లో బుధవారం విడుదల చేశారు. రైతుల కష్టాల నేపథ్యంలో ఈ పాట వస్తుంది. అన్నదాతల ఆక్రందనలను ఆర్థ్రంగా పలికించిన ఈ పాట అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. ఈ పాటను తమను ఎంతోగానో కదిలించిందని అభిమానులు పేర్కొన్నారు.
‘నీరు.. నీరు..
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ
గుండెలన్ని బీడు
ఆశలన్ని మోడు’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. శంకర్ మహదేవన్ ఆలపించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇంతకుముందు విడుదల చేసిన పాటలకు కూడా అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 7న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గుంటూరులోని హాయ్లాండ్లో నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న 'ఖైదీ నెం.150' సినిమాను విడుదల చేయనున్నారు.