తండ్రి తిమ్మారెడ్డితో రైటర్ వేమారెడ్డి
ఖైదీనంబర్ 150కి మాటలు రాయడం నా అదృష్టం
Published Fri, Jan 13 2017 9:16 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
మాటల రచయిత, డైరక్టర్ తిరుమల వేమారెడ్డి
ఎమ్మిగనూరురూరల్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనంబర్ 150కు మాటలు, డైలాగ్్స రాసే అవకాశం లభించడం తన అదృష్టమని రైటర్ తిరుమల వేమారెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆయన బంధువుల గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేమారెడ్డి మాట్లాడారు. తనది మంత్రాలయం మండలం కల్లుదేకుంట గ్రామమని చెప్పారు. తండ్రి తిమ్మారెడ్డి, తల్లి సరోజమ్మల ప్రోత్సాహంతోనే తాను సినీఫీల్డ్‌లో రచయితగా, డైరెక్టర్‌గా రాణిస్తున్నట్లు వెల్లడించారు. మొదట్లో రచయిత పోసాని మురళీకృష్ణ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత స్నేహితులు, శివయ్య, మనసిచ్చిచూడు, హనుమాన్ జంక‌్షన్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, రచ్చ, ధ్రువ తదితర సినిమాలకు రైటర్‌గా పనిచేశానన్నారు. వీవీ వినాయక్ తీసిని ‘దిల్’ సినిమాకు మాటలు రాయడంతో తనకు మంచి గుర్తింపు వచ్చిందనా్నరు. దర్శకుడిగా ‘చెక్కిలిగింత’ సినిమా తీసినట్లు చెప్పారు. తండ్రి తెచ్చి ఇచ్చిన నవలలు, పుస్తకాలు తన ఎదుగుదలకు దోహదపడ్డాయన్నారు.
Advertisement