vemareddy
-
వామ్మో.. రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు..
బిజినేపల్లి: గ్రామజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఓ వైపు వినియోగదారులకు జీరో బిల్లు ఇస్తుంటే.. మరోవైపు నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ సాధారణ వ్యక్తికి విద్యుత్ సిబ్బంది రూ.కోట్లలో బిల్లు ఇచ్చి షాకిచ్చారు. సాధారణంగా ఓ వినియోగదారునికి కరెంట్ బిల్లు నెలకు రూ.500 వరకు వస్తుంది. ఏసీ, ఫ్రిడ్జ్, గీజర్ వంటి వస్తువులు వాడితే.. రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వస్తుంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌కు చెందిన వేమారెడ్డికి ప్రతీ నెల రూ.వందల్లో బిల్లు వచ్చేది. ఈ క్రమంలో ఈ నెల 7న విద్యుత్ అధికారులు వేమారెడ్డి ఇంట్లో కరెంట్ మీటర్ స్కాన్ చేసి రూ.21,47,48,569 చెల్లించాల్సిందిగా బిల్లు ఇచ్చి వెళ్లారు.ఆలస్యంగా ఆ బిల్లు చూసుకున్న వేమారెడ్డికి ఒక్కసారి షాక్ కొట్టిన ట్లు అయింది. తమకు సాధా రణంగా రూ.వందల్లో రావాల్సిన బిల్లు రూ.కోట్లలో రావడం ఏమిటని ఆందోళన చెందుతూ ఆయన విద్యుత్ శాఖ అధికారులను ఆశ్రయించారు. దీనిపై ఏఈ మహేశ్‌ను వివరణ కోరగా జీరో బిల్లు చేసే సమయంలో అలా వచ్చిందని.. తిరిగి రీఎంట్రీ చేయడం ద్వారా మళ్లీ సాధారణంగా వచ్చి0దని తెలిపారు. -
ఖైదీనంబర్ 150కి మాటలు రాయడం నా అదృష్టం
మాటల రచయిత, డైరక్టర్ తిరుమల వేమారెడ్డి ఎమ్మిగనూరురూరల్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనంబర్ 150కు మాటలు, డైలాగ్్స రాసే అవకాశం లభించడం తన అదృష్టమని రైటర్ తిరుమల వేమారెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆయన బంధువుల గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేమారెడ్డి మాట్లాడారు. తనది మంత్రాలయం మండలం కల్లుదేకుంట గ్రామమని చెప్పారు. తండ్రి తిమ్మారెడ్డి, తల్లి సరోజమ్మల ప్రోత్సాహంతోనే తాను సినీఫీల్డ్‌లో రచయితగా, డైరెక్టర్‌గా రాణిస్తున్నట్లు వెల్లడించారు. మొదట్లో రచయిత పోసాని మురళీకృష్ణ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత స్నేహితులు, శివయ్య, మనసిచ్చిచూడు, హనుమాన్ జంక్షన్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, రచ్చ, ధ్రువ తదితర సినిమాలకు రైటర్‌గా పనిచేశానన్నారు. వీవీ వినాయక్ తీసిని ‘దిల్’ సినిమాకు మాటలు రాయడంతో తనకు మంచి గుర్తింపు వచ్చిందనా్నరు. దర్శకుడిగా ‘చెక్కిలిగింత’ సినిమా తీసినట్లు చెప్పారు. తండ్రి తెచ్చి ఇచ్చిన నవలలు, పుస్తకాలు తన ఎదుగుదలకు దోహదపడ్డాయన్నారు. -
ఐటీఐలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ కన్వీనర్ కె.వేమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మూడో విడత ప్రవేశం కోసం అభ్యర్థులు ఏ కాలేజీలో అయితే ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ కాలేజీలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐలలో ఈనెల 22న, ప్రైవేటు ఐటీఐలలో ఈనెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు.