ప్రభాస్‌ సలార్.. ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసలు.. ఎందుకంటే? | Prashanth Neel and Prabhas Crazy Project Salaar Dialogues Goes Viral | Sakshi
Sakshi News home page

Salaar: సలార్‌ సినిమా.. ప్రభాస్‌ డైలాగ్స్‌ వీడియో వైరల్!

Published Sun, Jan 21 2024 5:04 PM | Last Updated on Sun, Jan 21 2024 5:47 PM

Prashanth Neel and Prabhas Crazy Project Salaar Dialogues Goes Viral - Sakshi

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ నటించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్‌ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. స్నేహితునికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్‌ చేసే పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.  అయితే ఈ చిత్రంలో ప్రభాస్ డైలాగ్స్‌ సైతం ఫ్యాన్స్‌ను కట్టిపడేశాయి. 

తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్‌ వీడియో నెట్టింట వైరలవుతోంది. సలార్‌ మూవీ రన్‌టైమ్‌ 2 గంటల 55 నిమిషాలు కాగా.. అందులో ప్రభాస్‌ చెప్పిన డైలాగ్స్‌ దాదాపుగా 5 నుంచి 6 నిమిషాల వరకు ఉండవచ్చు. కానీ అవే డైలాగ్స్‌ కాస్తా స్పీడ్‌ వర్షన్‌లో చూస్తే కేవలం 2 నిమిషాల 33 సెకన్స్‌ మాత్రమే ఉన్నాయి. దాదాపు మూడు గంటల సినిమాలో కేవలం రెండున్నర నిమిషాలే  హీరో డైలాగ్స్‌ ఉండడం ప్రశాంత్‌ నీల్‌ ఘనతే అని నెటిజన్స్‌ ట్వీట్స్‌ చేస్తున్నారు. మరోవైపు కమర్షియల్‌ సినిమాలో ఇదొక అద్భుతమైన ప్రయోగమని నీల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement