త్వరలో 'ఖైదీ నంబర్ 150' పుస్తకావిష్కరణ | Chiranjeevi Khaidi No 150 Team Planning to Launch book | Sakshi
Sakshi News home page

త్వరలో 'ఖైదీ నంబర్ 150' పుస్తకావిష్కరణ

Published Thu, Dec 22 2016 11:20 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

త్వరలో 'ఖైదీ నంబర్ 150' పుస్తకావిష్కరణ

త్వరలో 'ఖైదీ నంబర్ 150' పుస్తకావిష్కరణ

సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతున్న మెగా మూవీ ఖైదీ నంబర్ 150. మెగా అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న.., మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావటంతో ఖైదీ నంబర్ 150పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ విషయంలో కూడా చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతీ విషయంలో అభిమానులను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే టీజర్, మేకింగ్ వీడియోలతో ఆకట్టుకున్న ఖైదీ టీం, త్వరలో ఈ సినిమా షూటింగ్ అనుభవాలతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ పుస్తకంలో ఖైదీ నంబర్ 150 సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల అనుభవాలను ప్రచురించనున్నారు. ఇప్పటికే ప్రింటింగ్ పనులు కూడా మొదలయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు మెగా టీం.

చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150, తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో డిసెంబర్ 25న మార్కెట్లోకి విడుదలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement