కనువిందు... చిరు చిందు | Chiranjeevi's Khaidi no 150 wraps up its talkie portions | Sakshi
Sakshi News home page

కనువిందు... చిరు చిందు

Published Fri, Dec 2 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

కనువిందు... చిరు చిందు

కనువిందు... చిరు చిందు

రానున్న సంక్రాంతికి హీరోగా తన రీ-ఎంట్రీ చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించిన చిరంజీవి, అందుకు తగ్గట్టుగానే ‘ఖైదీ నంబర్ 150’ చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటీవలే విదేశాల్లో రెండు పాటల చిత్రీకరణ ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు. వెంటనే సిటీలో కీలక సీన్లు తీయడం మొదలు పెట్టారు. టాకీ పార్ట్ షూటింగ్ గురువారంతో పూర్తయింది.

ప్రస్తుతం చిరంజీవి, హీరోయిన్ కాజల్ అగర్వాల్‌పై ఆఖరిగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తయితే చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టే అట. వీవీ వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.
సమర్పణ: శ్రీమతి సురేఖ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement