‘ఆచార్య’ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినీ ప్రియుల మదిలో మెదిలిన ఓకే ఒక ప్రశ్న ఈ మూవీలో కాజల్ ఉందా? లేదా? ఉంటే ట్రైలర్‌లో ఎందుకు చూపించలేదు? ఒకవేళ ఆమె పాత్రని తొలగిస్తే.. కారణం ఏంటి?. తాజాగా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ. ఆచార్య నుంచి కాజల్‌ని తొలగించినట్లు సృష్టం చేశాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చాడు.
‘సినిమా అనుకున్నప్పుడు.. హీరో అన్నాక హీరోయిన్ పక్కా ఉండాలి అనుకున్నాం. అందుకే హీరోయిన్ కోసం ఓ ఫన్నీ క్యారెక్టర్ క్రియేట్ చేశాం. కాజల్‌తో నాలుగు రోజుల పాటు షూటింగ్ కూడా చేశాం. కానీ ‘ఆచార్య’పాత్రకు లవ్ ఇంట్రస్ట్ ఉంటే బాగుంటుందా? లేదా? అనే డౌట్ వచ్చింది. అదే సమయంలో కరోనా లాక్‌డౌన్ వచ్చింది. అప్పుడు బాగా ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదు. పాటలు పెట్టలేం. ముగింపు సరిగా ఉండదు. అంత పెద్ద హీరోయిన్‌తో అలాంటి పాత్ర చేయిస్తే బాగోదు అనిపించింది. ఆమెను తప్పుగా వాడుకుంటున్నట్లు అనిపించింది.
(చదవండి: నా జీవితంలో మర్చిపోలేని రోజులవి: రామ్ చరణ్)
అదే విషయాన్ని చిరంజీవిగారికి చెబితే, కథకు ఏది అవసరం అయితే అది చెయ్ అన్నారు. ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకో అని చెప్పారు. కాజల్‌కు ఇదే విషయాన్ని చెప్పాను. ఆమె అర్థం చేసుకున్నారు. అందంగా నవ్వి.. అందరినీ మిస్ అవుతున్నాను. తప్పకుండా ఫ్యూచర్‌లో కలిసి సినిమా చేద్దామని అన్నారు. అలా కాజల్ పాత్రను తొలగించాం’ అని కొరటాల చెప్పుకొచ్చారు. అయితే లాహేలాహే సాంగ్‌లో కాజల్ ఉంటుందా లేదా? విషయంపై మాత్రం కొరటాల క్లారిటీ ఇవ్వలేదు. సినిమా చూసే తెలుసుకోవాలని చెప్పారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment