Acharya Trailer: Chiranjeevi and Ram Charan Starrer Acharya Movie Trailer Out Now - Sakshi
Sakshi News home page

Acharya Trailer: 'ఆచార్య'గా వచ్చేసిన చిరంజీవి.. అదరగొడుతున్న ట్రైలర్

Published Tue, Apr 12 2022 6:16 PM | Last Updated on Tue, Apr 12 2022 8:11 PM

Acharya Movie Trailer Released - Sakshi

 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'ఆచార్య'. డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి, మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.  ఈ సినిమాలో రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూ 'సిద్ధ' అనే పవర్‌ఫుల్‌ పాత్రలో అలరించనున్న విషయం తెలిసిందే. అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు 'ఆచార్య' తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 12న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

ప్రకటించినట్లుగానే మంగళవారం (ఏప్రిల్‌ 12)న సాయంత్రం 'ఆచార్య' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలానే చిరంజీవి, రామ్‌ చరణ్‌ తమదైన నటనతో అదరగొట్టారు. రామ్‌ చరణ్ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ధర్మస్థలి.. అపధర్మస్థలి ఎలా అవుతది ?, పాదఘట్టం వాళ్ల గుండెలపై కాలు వేస్తే.. ఆ కాలు తీసేయాలట.. వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసే డ్యాన్స్‌, ఫైటింగ్‌లు అభిమానులకు సూపర్‌ ఐ ఫీస్ట్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ చూస్తుంటే ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు ఇంకాస్తా పెరిగేలా ఉ‍న్నాయి. చిరంజీవి 152వ సినిమాగా వస్తున్న 'ఆచార్య' చిత్రాన్ని సోషల్‌ మీడియాతోపాటు 152 ప్రత్యేకమైన థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు సోమవారం (ఏప్రిల్‌ 11) ప్రకటించిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement