ఏ హీరోతో అంత సరదాగా లేను: కాజల్ | chiranjeevi's grace, charm has multiplied four-fold | Sakshi
Sakshi News home page

ఏ హీరోతో అంత సరదాగా లేను: కాజల్

Published Mon, Dec 12 2016 12:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

ఏ హీరోతో అంత సరదాగా లేను: కాజల్

ఏ హీరోతో అంత సరదాగా లేను: కాజల్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అందం నాలుగురెట్లు పెరిగిందంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. ఖైదీ నంబర్ 150 చిత్రంలో చిరంజీవితో జతకట్టిన అమ్మడు మెగా స్టార్పై పొగడ్తల వర్షం కురిపించింది. 'మెగా ఇమేజ్ను కూడా పక్కన పెట్టి సెట్లో అందరితో సరదాగా ఉండే వారు.నేను సెట్లో కంఫర్టబుల్గా మూవ్ అయ్యేలా అవకాశం ఇచ్చారు. నేను నటించిన చిత్రాల్లోని ఏ ఇతర హీరోతో కూడా అంత సరదాగా గడపలేదు. సెట్లో ఉన్న వారందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. షూటింగ్ సమయంలో ఆయనతో సరదాగా జోకులు కూడా వేశాను. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి నిజంగా ఓ గొప్ప డ్యాన్సర్' అంటూ  కాజల్ తెగ సంబరపడుతోంది.

'డ్యాన్స్ చేసే సమయంలో కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. వాటి ద్వారా నా డ్యాన్స్లో మార్పు కూడా వచ్చింది. ఆ మార్పును సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చూడొచ్చు. ఇంత కాలం చిరు సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది. మెగాస్టార్తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా.  అయనతో కలిసి పని చేయడం నాకు ఎంతో ప్రత్యేకం' అంటూ  కాజల్ మురిసిపోయింది.

సురేఖ సమర్పణలో వీవీ వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి చిత్రానికి రీమేక్గా వస్తున్న ఈ చిత్రం 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement