
'నన్ను చాలా బాగా చూపించారు.. థ్యాంక్స్'
లక్ష్మీరాయ్(రాయ్ లక్ష్మీ).. ఈ మధ్యకాలంలో కాస్తంత సందడి తగ్గినా మరోసారి అనూహ్యంగా మెరుపులా మెరిసింది. అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైదీ నంబర్150. ఈ చిత్రంలో చిరుతో కలిసి ఆమె రత్తాలు అనే మంచి ఊపున్న ఐటెమ్ మాస్ గీతానికి చిందులేసింది. చిరుతో కలిసి దుమ్మురేపే స్టెప్పులేసింది.
ఈ పాట కూడా మొత్తం చిత్ర ఆల్బమ్‌లోనే పెద్ద హిట్‌గా నిలవడంతో ఇప్పుడు ఆమె సంతోషానికి అవధులేకుండా పోయింది. పైగా ఈ పాటలో కూడా రాయ్ చాలా అందంగా చూపించారంట. దీంతో తనను గతంలో ఎప్పుడూ లేనంత అందంగా తెరపై ఆవిష్కరించడంతో ఆమె చిత్ర యూనిట్ మొత్తానికి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా తనను అందంగా తీర్చిదిద్ది చూపించిన సుష్మిత కొణిదెలకు తన ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మురిసిపోయింది ఈ అమ్మడు.
Must thank my entire team of #KhaidiNo150 fr making me look so good!Special thanks to @sushkonidela For making #Ratthalu look the best 😘😬💃 pic.twitter.com/LqbUGHc5OQ
— RAAI LAXMI (@iamlakshmirai) 1 January 2017