
రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘జనతా బార్’. రోచి శ్రీమూవీస్ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. నేడు రాయ్‌లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా ‘జనతా బార్’ టైటిల్ లోగో, ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా రమణ మొగిలి మాట్లాడుతూ– ‘‘స్పోర్ట్స్ నేపథ్యంలో జరగుతున్న అన్యాయాలు, లైంగిక వేధింపులపై ఓ యువతి చేసిన పోరాటమే ‘జనతా బార్’.
ఈ చిత్రంలో మంచి సందేశం కూడా ఉంది. నాలుగు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెల 8న హైదరాబాద్‌లో ఆ పాటల చిత్రీకరణ ఆరంభిస్తాం’’ అన్నారు. శక్తి కపూర్, ప్రదీప్ రావత్, సురేష్, దీక్షాపంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య, కెమెరా: చిట్టిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అశ్వథ్ నారాయణ, అజయ్ గౌతమ్.
Comments
Please login to add a commentAdd a comment