
మెగా అభిమానులకు దీపావళి కానుక
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దీపావళి కానుక ఇచ్చారు చిరు టీం. చిరంజీవి ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నంబర్ 150 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టైటిల్ లోగోతో పాటు చిరు షాడో ఇమేజెస్ తో కొన్ని పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. తాజాగా దీపావళి కానుకగా చిరు లుక్ రివీల్ చేస్తూ మరో రెండు పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
తమిళ్ లో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం తరువాత చిరంజీవి ఫుల్ లెంగ్త్ రోల్ లో వెండితెర మీద కనిపిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా మెగా టీం కూడా ఇంట్రస్టింగ్ పోస్టర్ లతో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.