చిరు 150కి విలన్ ఫిక్స్ అయ్యాడు..? | Villain confirmed for Chiru150 | Sakshi
Sakshi News home page

చిరు 150కి విలన్ ఫిక్స్ అయ్యాడు..?

Published Thu, Jul 28 2016 11:59 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

చిరు 150కి విలన్ ఫిక్స్ అయ్యాడు..?

చిరు 150కి విలన్ ఫిక్స్ అయ్యాడు..?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా విషయంలో మెగా ఫ్యామిలీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకూ.. ఇప్పటికీ నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. కీలకమైన హీరోయిన్, విలన్ పాత్రలను కూడా ఇంత వరకు ఫైనల్ చేయలేదు చిత్రయూనిట్. తాజాగా విలన్ రోల్కు సంబందించి ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది.

పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన బెంగళూరు మోడల్, హీరోయిన్ అంజలా జవేరి భర్త, తరుణ్ అరోరాను చిరంజీవి 150 సినిమాకు విలన్గా ఫైనల్ చేశారట. ఒరిజిలన్ వర్షన్లో నీల్ నితిన్ ముఖేష్ నటించిన ఈ పాత్రను ముందుగా తెలుగులో కూడా అతనితోనే చేయించాలని భావించారు. తరువాత జగపతిబాబు, మోహన్ బాబు లాంటివారి పేర్లు వినిపించినా.. ఎవరినీ కన్ఫామ్ చేయలేదు. తాజాగా తరుణ్ అరోరా పేరు తెర మీదకు వచ్చింది. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement