చాలా రోజులుగా మెగా అభిమానులను ఊరిస్తూ వస్తున్న ఆ రోజు దగ్గర్లోనే ఉందన్న సంకేతాలిస్తోంది మెగఫ్యామిలీ. అఫీషియల్గా కన్ఫామ్ చేయకపోయినా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అతి త్వరలో...
చాలా రోజులుగా అభిమానులను ఊరిస్తున్న రోజు దగ్గర్లోనే ఉందన్న సంకేతాలిస్తోంది మెగా ఫ్యామిలీ. అఫీషియల్గా కన్ఫమ్ చేయకపోయినా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుందట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ప్రకటించకపోయినా మీడియా సర్కిల్స్లో మాత్రం జూన్ 6న షూటింగ్ స్టార్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు. తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్తో కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. చిరు సరసన అనుష్క హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కత్తిలాంటోడు అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాను 2017 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.