ఆ విషయం ఏమో చెప్పలేను: రాంచరణ్ | Not sure if I will act in dad 150th film, says Ram Charan | Sakshi
Sakshi News home page

ఆ విషయం ఏమో చెప్పలేను: రాంచరణ్

Published Fri, Jul 15 2016 4:55 PM | Last Updated on Wed, Jul 25 2018 3:25 PM

ఆ విషయం ఏమో చెప్పలేను: రాంచరణ్ - Sakshi

ఆ విషయం ఏమో చెప్పలేను: రాంచరణ్

చెన్నై: మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా 'కత్తి' రీమేక్ ద్వారా 150వ చిత్రంతో ఆయన మళ్లీ ప్రేక్షకులను పలుకరించనున్నాడు. గురువారం సాయంత్రం ఫేస్‌బుక్ లైవ్  చాటింగ్‌లో అభిమానులతో ముచ్చటించిన మెగా హీరో రాంచరణ్ తన తండ్రి 150వ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముందని చెప్పారు.

చిరు 150వ సినిమాకు 'కత్తిలాంటోడు' టైటిల్ పెట్టారని వార్తలు వస్తుండగా.. చరణ్ ఆ వార్తలను తోసిపుచ్చాడు. ఇంకా సినిమాకు పేరు పెట్టలేదని తెలిపాడు. ప్రస్తుతం 'ధ్రువ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్ 15నిమిషాల పాటు లైవ్ చాటింగ్‌లో ముచ్చటించాడు. బాబాయి పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడం తనకు ఇష్టమేనని, అయితే, ఇందుకు మంచి కథ దొరకాల్సిన అవసరముందని చెప్పాడు.

ఇక చిరు 150వ సినిమాలో నటించే విషయమై రాంచరణ్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలో తాను నటిస్తానో లేదోనని అన్నాడు. 'ఈ సినిమాలో నేను నటిస్తానా అన్నది కచ్చితంగా చెప్పలేను. ఈ సినిమాకు నేను నిర్మాతగా ఉన్నాను. దర్శకుడు వినాయక్, మా నాన్నగారు సినిమాలో నేను నటించాలని కోరుకుంటే.. నేను ఒక పాటలో కనిపించే అవకాశముంది' అని చరణ్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement