చిరు, పవన్లకు చెర్రీ గిఫ్ట్స్ | Druva Movie Teaser and Audio Release Dates | Sakshi
Sakshi News home page

చిరు, పవన్లకు చెర్రీ గిఫ్ట్స్

Published Sun, Jul 10 2016 12:21 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

చిరు, పవన్లకు చెర్రీ గిఫ్ట్స్ - Sakshi

చిరు, పవన్లకు చెర్రీ గిఫ్ట్స్

మెగా ఫ్యామిలీ యువ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి, బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల పుట్టిన రోజు సందర్భంగా వారికి గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నాడు. చిరు హీరోగా తెరకెక్కుతున్న కత్తిలాంటోడు సినిమా నిర్మిస్తున్న చరణ్, తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న ధృవ ఫస్ట్ టీజర్ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న మెగా అభిమానుల కోసం ధృవ ఆడియో ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడట. దసరా సమయంలో విడుదల కానున్న ధృవ, తమిళ సూపర్ హిట్ మూవీ తనీ ఒరువన్కు రీమేక్గా రూపొందుతోంది. చరణ్ కు జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ సినిమాలో.. ఒరిజినల్ వర్షన్లో విలన్గా నటించిన అరవింద్ స్వామి మరోసారి ప్రతినాయక పాత్రలో తెరమీద కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement