మెగా అభిమానులకు భారీ షాక్..? | Dhruva, Khaidi no 150 Release Dates Postponed | Sakshi
Sakshi News home page

మెగా అభిమానులకు భారీ షాక్..?

Published Tue, Nov 15 2016 3:26 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

మెగా అభిమానులకు భారీ షాక్..?

మెగా అభిమానులకు భారీ షాక్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ధృవ, మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ నంబర్ 150 సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ సినిమా ఆడియో రిలీజ్ కూడా అయిపోయింది. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

అయితే దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో జనం థియేటర్ల మొహం చూడటమే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ధృవ సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్ల విషయంలో తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. అందుకే సినిమాను వాయిదా వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో చేస్తున్నారట.

ధృవ సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేస్తే జనవరిలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ అదే సమయం మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకే సమయంలో రెండు మెగా ఫ్యామిలీ సినిమాలు విడుదల చేయడం కరెక్ట్ కాదన్న ఆలోచనలో ఉన్నారు యూనిట్. అందుకే ధృవను సంక్రాంతికి రిలీజ్ చేసి, ఖైదీ నంబర్ 150ని సమ్మర్కు పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉంటుదన్న ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాల వాయిదాపై అధికారిక ప్రకటన లేకపోయినా.. పరిస్థితులు చూస్తుంటే వాయిదా పడటం ఖాయంగానే కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement