చిరు జోరు మొదలైంది | Chiru Khaidi no 150 is sold for a record price | Sakshi
Sakshi News home page

చిరు జోరు మొదలైంది

Published Fri, Sep 9 2016 1:56 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

చిరు జోరు మొదలైంది

చిరు జోరు మొదలైంది

మెగా అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెగా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిరు రీ ఎంట్రీ సినిమా కావటం.., అదే సమయంలో 150వ సినిమా కూడా కావటంతో మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్తో పాటు ఆయన ఇమేజ్కు తగ్గట్టుగా మేసేజ్ కూడా ఉండేలా తమిళ సూపర్ హిట్ సినిమా కత్తిని ఖైదీ నంబర్ 150 పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఇంతటి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా.., షూటింగ్ సమయంలోనే రికార్డ్ల వేట మొదలెట్టింది. చిరు రీ ఎంట్రీ సినిమా కావటంతో ఖైదీ నంబర్ 150 పంపిణీ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటి పడుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకే బాహుబలి తరువాత అత్యధిక మొత్తానికి చిరు సినిమా రైట్స్ అమ్ముడయ్యాయన్న టాక్ వినిపిస్తోంది.

దాదాపు 13.5 కోట్లకు ఖైదీ నంబర్ 150 సినిమా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2017 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement