ఖైదీ సభలో పవన్‌ నిర్మాత స్పీచ్‌..! | Sharrath Marar Speech at Khaidi No 150 Pre Release Event | Sakshi
Sakshi News home page

ఖైదీ సభలో పవన్‌ పేరు పలుకగానే..!

Published Sat, Jan 7 2017 9:01 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఖైదీ సభలో పవన్‌ నిర్మాత స్పీచ్‌..! - Sakshi

ఖైదీ సభలో పవన్‌ నిర్మాత స్పీచ్‌..!

గుంటూరు: హాయ్‌ల్యాండ్‌లో జరిగిన చిరంజీవి 150 సినిమా 'ఖైదీనంబర్‌ 150' ప్రిరిలీజ్‌ వేడుకకు ఊహించినట్టే.. ఆయన సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ హాజరుకాలేదు. అంతకుముందు ఈ సినిమా గురించి స్పందించిన ట్విట్టర్‌లో పవన్‌ కల్యాణ్‌ స్పందించిన సంగతి తెలిసిందే.  చరణ్, మా వదిన సురేఖగారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు' ఆయన అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు ఆయన తప్పకుండా ఈ వేడుకలో హాజరవుతారని మెగా ఫ్యాన్స్‌లో ప్రచారం జరిగింది.

పవన్‌ రాకపోయినా ఆయన తరఫున ’కాటమరాయుడు’ నిర్మాత శరత్‌ మరార్‌ ఈ వేడుక వచ్చారు. పవన్‌ కల్యాణ్‌ తరఫున చిరంజీవికి, ఖైదీ నెంబర్‌ 150 చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు పంపించారు. ఈ సినిమా ఘనవిజయం కావాలని పవన్‌ కల్యాణ్‌ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శరత్‌ మరార్‌ పవన్‌ కల్యాణ్‌ పేరు ఎత్తగానే ఈ సభాప్రాంగణం మెగాఫ్యాన్స్‌ కెరింతలతో మార్మోగింది. మరోవైపు ఈ వేడుకకు రాకపోవడంతో ఆయన ఎందుకు రాలేదు అనే కోణంలో అభిమానుల్లో చర్చ నడిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement