
నువ్వూ..నేనూ.. అంటోన్న మెగా స్టార్
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' చిత్రంలోని మరో పాటను బుధవారం విడుదల చేశారు. మీ..మీ..మీమీమీ..ఇకపై ఓన్లీ యూ అండ్ మీ..అంటూ సాగే మూడో సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
సాయంకాలానా, సాగర తీరానా. సంధ్యా సూర్యుడిలా..నువ్వూ..నేనూ...
వేసవి కాలానా..వెన్నెల సమయానా..తారా చంద్రుడిలా నువ్వూ..నేనూ..
అంటూ సాగే మెలోడీ సాంగ్ మెగా అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదల చేసిన 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు', 'సుందరి' పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్ర పోస్టర్ కూడా బుధవారమే రిలీజైంది. ఇందులో పంచకట్టులో పవన్ అభిమానులకు కనువిందు చేశారు.