తెలుగుదనంతో...
తెలుగుదనంతో...
Published Thu, Mar 6 2014 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
తెలుగు టైటిల్స్, తెలుగుదనం ఉట్టిపడే చిత్రాలు అరుదైన ఈరోజుల్లో అచ్చ తెలుగు టైటిల్‌తో, తెలుగు వాతావరణం ప్రతిబింబించేలా తీసిన సినిమా ‘అడవి కాచిన వెన్నెల’. కానీ, టేకింగ్ మాత్రం హాలీవుడ్ సినిమాల తరహాలో ఉంటుందని చిత్రకథానాయకుడు, అరవింద్ కృష్ణ, నాయిక మీనాక్షి దీక్షిత్ అంటున్నారు. అక్కి విశ్వనాధరెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో పూజా రామచంద్రన్ మరో కథానాయిక.సినిమాలో కీలక పాత్ర చేసిన బేబి అక్కి ప్రచార చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా అరవింద్ కృష్ణ మాట్లాడుతూ -‘‘దర్శకుడు ఈ టైటిల్ చెప్పగానే సినిమా ఎలా ఉంటుందోనని ఒకింత టెన్షన్ పడ్డాను. కానీ, షూటింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. ఓ కొత్త జానర్‌లో రూపొందిన అచ్చ తెలుగు సినిమా. కాన్సెప్ట్‌తో పాటు టేకింగ్ కూడా వినూత్నంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని మీనాక్షి దీక్షిత్ అన్నారు. అవుట్‌పుట్ సంతృప్తికరంగా వచ్చిందని, ఈ నెల 16న పాటలను విడుదల చేస్తామని దర్శక, నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వేరరావు, హలీమ్ కూడా పాల్గొన్నారు.
Advertisement
Advertisement