Adavi Kachina Vennela
-
ఊహకందని కోణాలు
అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా మూన్లైట్ డ్రీమ్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాథరెడ్డి రూపొందించిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. వచ్చే నెల 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ -‘‘ఓ భిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఊహకందని కోణాలు ఈ కథలో ఉంటాయి. సిరివెన్నెల సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయాలనే లక్ష్యంతో చేశాం. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం టేకింగ్ మాత్రం హాలీవుడ్ స్టయిల్లో ఉంటుంది. దర్శక, నిర్మాతగా నాకు మాత్రమే కాదు... నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు. -
ఊహకందని కోణాలు...
అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. అక్కి విశ్వనాథరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడుతూ-‘‘భిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఊహకందని కోణాలు ఈ కథలో ఉంటాయి. సిరివెన్నెల సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఆర్.కార్తీక్, జోస్యభట్ల కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఇటీవలే విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఇందులో శక్తిమంతమైన పాత్ర చేశాను. ఆర్టిస్టులు ఎలివేట్ అవ్వాలంటే మంచి నేపథ్య సంగీతం ముఖ్యం. ఇందులో అద్భుతమైన రీ-రికార్డింగ్ కుదిరింది. దర్శకుడు అన్ని శాఖల నుంచి మంచి అవుట్‌పుట్‌ని రాబట్టుకున్నారు’’ అని అరవింద్ కృష్ణ చెప్పారు. ఆడియోకి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని సంగీత దర్శకులు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, కళ్లు కృష్ణారావు తదితరులు కూడా మాట్లాడారు. -
హాలీవుడ్ తరహాలో...
అరవింద్‌కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్, బేబి అక్కి ముఖ్య తారలుగా మూన్లైట్ డ్రీమ్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాథరెడ్డి రూపొందించిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందించిన ఈ చిత్రం కొత్త జానర్లో ఉంటుందని విశ్వనాథరెడ్డి తెలిపారు. వచ్చే నెల ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ- ‘‘కొత్త కథ, కథనంతో రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా టైటిల్ వినగానే అదో తరహా సినిమా అనుకునే అవకాశం ఉంది. కానీ, ఇది పాజిటివ్ సినిమా. క్లయిమాక్స్ కూడా పాజిటివ్‌గానే ఉంటుంది. ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయాలనే లక్ష్యంతో చేశాం. కథ, కథనం, మాటలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అరవింద్‌కృష్ణ అద్భుతంగా నటించారు. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాల తరహాలో సాగే అచ్చ తెలుగు సినిమా’’ అన్నారు. -
తెలుగుదనంతో...
తెలుగు టైటిల్స్, తెలుగుదనం ఉట్టిపడే చిత్రాలు అరుదైన ఈరోజుల్లో అచ్చ తెలుగు టైటిల్‌తో, తెలుగు వాతావరణం ప్రతిబింబించేలా తీసిన సినిమా ‘అడవి కాచిన వెన్నెల’. కానీ, టేకింగ్ మాత్రం హాలీవుడ్ సినిమాల తరహాలో ఉంటుందని చిత్రకథానాయకుడు, అరవింద్ కృష్ణ, నాయిక మీనాక్షి దీక్షిత్ అంటున్నారు. అక్కి విశ్వనాధరెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో పూజా రామచంద్రన్ మరో కథానాయిక.సినిమాలో కీలక పాత్ర చేసిన బేబి అక్కి ప్రచార చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా అరవింద్ కృష్ణ మాట్లాడుతూ -‘‘దర్శకుడు ఈ టైటిల్ చెప్పగానే సినిమా ఎలా ఉంటుందోనని ఒకింత టెన్షన్ పడ్డాను. కానీ, షూటింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. ఓ కొత్త జానర్లో రూపొందిన అచ్చ తెలుగు సినిమా. కాన్సెప్ట్‌తో పాటు టేకింగ్ కూడా వినూత్నంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని మీనాక్షి దీక్షిత్ అన్నారు. అవుట్‌పుట్ సంతృప్తికరంగా వచ్చిందని, ఈ నెల 16న పాటలను విడుదల చేస్తామని దర్శక, నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వేరరావు, హలీమ్ కూడా పాల్గొన్నారు. -
అచ్చతెనుగు ‘అడవి కాచిన వెన్నెల’
అరవింద్‌కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాధరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. ఆదివారం ఈ చిత్రం ప్రచార చిత్రాలను ఎ.రమేష్‌ప్రసాద్ ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ - ‘‘టైటిల్ వినగానే ఇది అదో తరహా సినిమా అనుకునే అవకాశం ఉంది. కానీ, ఇది నెగటివ్ సినిమా కాదు. పాజిటివ్‌గా సాగడంతో పాటు క్లయిమాక్స్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. కొత్త కథ, కథనంతో రూపొందిస్తున్నాం. జనవరిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. హాలీవుడ్ చిత్రంలో నటించినట్లపించిందని మీనాక్షి అన్నారు. హౌస్‌వైఫ్‌గా నటించానని పూజా చెప్పారు. అరవింద్‌కృష్ణ చెబుతూ-‘‘దర్శకుడు చెప్పిన కథ అద్భుతం అనిపించింది. ఇందులో గొప్ప డైలాగులున్నాయి. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందిన అసలు సిసలైన తెలుగు సినిమా ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ రోడ్రిగ్యుజ్, డా. జోశ్యభట్ల, పాటలు: సిరివెన్నెల.