
‘వార్నింగ్‌లు, వారెంట్‌లు, జైళ్లు, బెయిళ్లు ఉండవ్. తప్పు చేసిన క్రిమినల్స్ చిక్కితే ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవ్వదు’ అంటూ ‘పవర్’ సినిమాలో పోలీసు పవర్ ఏంటో చూపించి, ప్రేక్షకులను మెప్పించారు రవితేజ. అంతేకాదు, ‘విక్రమార్కుడు’, ‘మిరపకాయ్’ సినిమాల్లో పోలీసాఫీసర్ పాత్రలో రవితేజ ఎంతలా రెచ్చిపోయారో గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన అంతా ఎందుకంటే... విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. బహుశ ఈ సినిమాలో మరోసారి పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు రవితేజ. మరోవైపు సోషల్ మీడియాలో రవితేజ పోలీస్ గెటప్‌లో ఉన్న ఫొటోలు ట్రోల్ అవడంతో ఖాకీ దుస్తుల్లో ఆయన కనిపించడం ఖాయం అంటున్నారు అభిమానులు. అంటే.. రవితేజ మరోసారి గన్ పట్టి బాక్సాఫీసుపై గురి పెట్టారన్నమాట. రాశీఖన్నా, సీరత్‌కపూర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి బరిలో దింపాలని చిత్రబృందం ఆలోచిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment