
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పదునైన ట్వీట్లతో రెచ్చిపోయారు. జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో ఆ పార్టీ తీరుపై, పవన్ కళ్యాణ్‌పై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలంటే దేవుడితో చెప్పుకోండి అని జనసేన మీడియా ప్రతినిధి చెబుతుంటే..పవన్ మా దేవుడు అని జనసైనికులు చెబుతున్నారని సెటైర్లు వేశారు.
‘జనసైనికులూ.. మిమ్మల్ని వేరే పార్టీలకు అమ్మేస్తారు జాగ్రత్త’ అంటూ హితవు పలుకుతూ కత్తి మహేష్ ట్వీట్ చేశారు. సెటిల్మెంట్ భూమి మీద పార్టీ నిర్మాణాలు మొదలుపెట్టిన పవన్, అవినీతిరహిత రాజకీయాలు తీసుకొస్తానని మాట్లాడటం ప్రపంచంలో ఎనిమిదో వింతగా కత్తి అభివర్ణించారు. గతంలోనూ పవన్ టార్గెట్‌గా కత్తి చేసిన ట్వీట్లు పెనుదుమారం రేపాయి. పవన్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య సుదీర్ఘంగా నెలకొన్న ఘర్షణ వాతావరణానికి ఇటీవల తాత్కాలికంగా తెరపడినా మళ్లీ కత్తి చేస్తున్న ట్వీట్లపై పవన్ అభిమానుల స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది.
రైతుల సమస్యల గురించి మాట్లాడాలి. టైం ఇవ్వండి. అంటే, దేవుడితో చెప్పుకోండి అనే జనసేన మీడియా ప్రతినిధి. పవన్ కళ్యాణ్ మా దేవుడు అని నమ్మే జనసైన్యం. జనసైనికులారా...ఇలాంటివాళ్ళు మిమ్మల్ని జమ సైనికులుగా చేసి వేరే పార్టీలకు లెక్కగట్టేస్తారు. జాగ్రత్త! pic.twitter.com/M9h1g5fGj0
— Kathi Mahesh (@kathimahesh) 14 March 2018