సాక్షి, హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పై విమర్శల దాడిని తగ్గించిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరో సారి తనదైన శైలిలో స్పందించాడు. చలోరేచలో ప్రజాయాత్రలో భాగంగా పవన్‌కళ్యాణ్ అనంతపూర్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయం కాదని భావిస్తున్నాడేమోననే సందేహం వ్యక్తం చేస్తూ సుతిమెత్తంగా విమర్శించాడు.
‘చంద్రబాబు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నంతవరకు, జనసేన పార్టీని ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ప్రొజెక్ట్ చేయకపోవడమే పవన్ కళ్యాణ్ రాజనీతి అయితే,ఆలోచించాల్సిందే!’ అని ట్వీట్ చేశాడు.
ఇక అంతకు ముందు జనసేనానిని ఉద్దేశించి కొన్ని సూచనలు చేశారు. తంత్రం లేని సేనాని, యుద్ధం లేని సైన్యం అంటూ వ్యాఖ్యానించారు. సమస్య ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉందని, ఇప్పటికైనా ఆలస్యం కాలేదని, ఏదో ఒకటి చెయెచ్చని పలు సూచనలు చేశారు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మార్చొచ్చంటూ పవన్‌ను కత్తి మహేష్ అలర్ట్ చేశారు.
గత నాలుగు నెలలుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడిచి దాడుల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. చివరకు గుడ్లతో దాడి అనంతరం జనసేన పార్టీ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో శాంతించిన కత్తి అభిమానులపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి మౌనం వహించిన కత్తి తాజాగా పవన్‌ను సుతిమెత్తంగా విమర్శిస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
చంద్రబాబు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నంతవరకు, జనసేన పార్టీని ఒక బలమైన alternative గా ప్రాజెక్ట్ చేయకపోవడమే పవన్ కళ్యాణ్ రాజనీతి అయితే,ఆలోచించాలసిందే!
— Kathi Mahesh (@kathimahesh) 29 January 2018
తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవెల్ లోనే ఉంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఎదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాలవైపు వచ్చేలోగా ఎంతోకొంత మార్చొిచ్చు.
— Kathi Mahesh (@kathimahesh) 29 January 2018
Comments
Please login to add a commentAdd a comment