janasena President
-
పవన్ ఫ్లాప్ షో.. 5 నిమిషాల్లోనే ముగిసిన పర్యటన
సాక్షి, పుట్టపర్తి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఫ్లాప్ షోను తలపించింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన ఆయన...రోడ్డుమార్గంలో కొత్తచెరువుకు వచ్చారు. ఓ కుటుంబాన్ని పరామర్శించి 5 నిముషాల్లో పర్యటన ముగించుకుని ధర్మవరం వెళ్లిపోయారు. పరామర్శలో ట్విస్ట్ పవన్ తొలుత కొత్తచెరువుకు చెందిన రైతు సమిటి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తారని ఆ పార్టీ స్థానిక నాయకులు రైతు కుటుంబానికి రెండు రోజుల కిందట సమాచారం ఇచ్చారు. అయితే రామకృష్ణ కుటుంబానికి వైఎస్సార్ రైతు బీమా సొమ్ము రూ.7 లక్షలను ప్రభుత్వం అందించిందని మంగళవారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురణ కావటంతో పవన్ రూటు మార్చారు. నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన కౌలు రైతు సాకే రామకృష్ణ భార్య సుజాతను పవన్ పరామర్శించారు. అది కూడా వంకరకుంట గ్రామానికి వెళ్లకుండా రైతు కుటుంబాన్నే కొత్తచెరువుకు రప్పించుకున్నారు. చదవండి: (బయటపడ్డ పవన్ కల్యాణ్ రాజకీయ డ్రామాలు) -
తిరుపతిలో బీజేపీకి అంత సీన్ లేదు..!
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కచ్చితంగా పోటికి దింపాలని జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. బీజేపీకి సీటు కేటాయించి వారికి సహకరించాలంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని వారు పేర్కొన్నట్లు సమాచారం. తిరుపతిలో గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. అనంతరం పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పవన్ కల్యాణ్‌కు వాస్తవ పరిస్థితులు వివరించారు. తిరుపతిలో బీజేపీకి గెలిచే సీన్ లేదని చెప్పినట్లు తెలిసింది. బీజేపీ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహకరించబోమని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతోపాటు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సహకరించిన నేపథ్యంలో తిరుపతిలో మనమే పోటీ చేద్దామని తేల్చిచెప్పినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. అయితే అంతకుముందు పీఏసీ సమావేశంలో కూడా దీనిపై చర్చించినట్లు తెలిసింది. -
పవన్ కల్యాణ్.. భగత్‌సింగ్ ఆత్మహత్య చేసుకున్నారా?
సాక్షి, హైదరాబాద్ : భగత్ సింగ్.. మండే అగ్ని గోళం. జ్వలించే నిప్పుకణిక. రెపరెపలాడే విప్లవ పతాక. భగత్ సింగ్ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 23 ఏళ్ల వయసులోనే... దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి... ఉరికొయ్యను ముద్దాడిన ఈ స్వాతంత్ర్య సమరయోధుడు ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. డల్లాస్ వేదికగా జరిగిన జనసేన ప్రవాసగర్జనలో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య సమరయోధులను ఉదహరిస్తూ భగత్ సింగ్ పేరును ప్రస్తావించారు. భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను చదవాలని సూచించారు. అయితే భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదని, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై హింసాత్మక ఉద్యమం చేపట్టి.. వారి చేతిలో ఉరితీయబడ్డారని అందరికీ తెలిసిందే. కానీ పవన్ కల్యాణ్ మాత్రం పొరపాటుగా భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ అజాద్ పేరు బదులు భగత్ సింగ్ పేరును పొరపాటుగా ప్రస్తావించారని ఆయన అభిమానులు సమర్ధించుకుంటున్నారు. బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టడంతో ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్నప్పుడు చేసిన శపథం నిజం చేస్తూ ఆజాద్ తన తుపాకీతో కాల్చుకుని వీరమరణం పొందిన విషయం తెలిసిందే. -
టీడీపీపై కోపంతో అన్యాయం చేయకండి : పవన్
సాక్షి, హైదరాబాద్ : టీడీపీపై ఉన్న కోపంతో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయవద్దని కేంద్రాన్ని జనసేన అధినేత పవన కల్యాణ్ కోరారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన ట్విటర్లో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని... హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలతో కలసి తాను కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. ‘ఏపీ ప్రజల తరపున కేంద్రాన్ని కోరుతున్నా. పార్లమెంట్‌కు మించిన వేదిక మరొకటి లేదు.. మా హక్కుల గురించి అర్థం చేసుకోండి. దయచేసి న్యాయం చేయండి. టీడీపీపై ఉన్న కోపంతో ప్రత్యేక హోదాను నిరాకరించకండి. బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలు ఇచ్చిన మంచి అవకాశాన్ని వృథా చేసుకున్నారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల తరపున నిలబడాలి’ అని పవన్ వరుస ట్వీట్లు చేశారు. BJP’s anger on TDP leadership shouldn’t be the reason to deny SCS to the people of AP. — Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018 BJP & TDP had wasted a great opportunity given to them by people of AP. They could have truly stood by people instead of this political theatrics,which is causing great deal of public’s valuable time ,money & agony. — Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018 -
‘చంద్రబాబుకు ప్రత్యామ్నాయం కాదనుకుంటున్నాడేమో’
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పై విమర్శల దాడిని తగ్గించిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరో సారి తనదైన శైలిలో స్పందించాడు. చలోరేచలో ప్రజాయాత్రలో భాగంగా పవన్‌కళ్యాణ్ అనంతపూర్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయం కాదని భావిస్తున్నాడేమోననే సందేహం వ్యక్తం చేస్తూ సుతిమెత్తంగా విమర్శించాడు. ‘చంద్రబాబు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నంతవరకు, జనసేన పార్టీని ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ప్రొజెక్ట్ చేయకపోవడమే పవన్ కళ్యాణ్ రాజనీతి అయితే,ఆలోచించాల్సిందే!’ అని ట్వీట్ చేశాడు. ఇక అంతకు ముందు జనసేనానిని ఉద్దేశించి కొన్ని సూచనలు చేశారు. తంత్రం లేని సేనాని, యుద్ధం లేని సైన్యం అంటూ వ్యాఖ్యానించారు. సమస్య ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉందని, ఇప్పటికైనా ఆలస్యం కాలేదని, ఏదో ఒకటి చెయెచ్చని పలు సూచనలు చేశారు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మార్చొచ్చంటూ పవన్‌ను కత్తి మహేష్ అలర్ట్ చేశారు. గత నాలుగు నెలలుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడిచి దాడుల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. చివరకు గుడ్లతో దాడి అనంతరం జనసేన పార్టీ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో శాంతించిన కత్తి అభిమానులపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి మౌనం వహించిన కత్తి తాజాగా పవన్‌ను సుతిమెత్తంగా విమర్శిస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నంతవరకు, జనసేన పార్టీని ఒక బలమైన alternative గా ప్రాజెక్ట్ చేయకపోవడమే పవన్ కళ్యాణ్ రాజనీతి అయితే,ఆలోచించాలసిందే! — Kathi Mahesh (@kathimahesh) 29 January 2018 తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవెల్ లోనే ఉంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఎదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాలవైపు వచ్చేలోగా ఎంతోకొంత మార్చొిచ్చు. — Kathi Mahesh (@kathimahesh) 29 January 2018 -
నేడు తిరుపతికి పవన్ కల్యాణ్
– వినోద్ రాయల్ కుటుంబ సభ్యులకు పరామర్శ సాక్షి ప్రతినిధి, తిరుపతి : జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ గురువారం ఉదయం తిరుపతి రానున్నారు. ఈ నెల 21న కర్ణాటకలోని కోలారులో హత్యకు గురైన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగే పవన్ కల్యాణ్ 10.45 గంటలకు తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని వినోద్ రాయల్ ఇంటికి చేరుకుంటారని పార్టీ జిల్లా ఇన్చార్జి, పవన్ కల్యాణ్ అభిమాన సంఘాల నాయకుడు కిరణ్ రాయల్ బుధవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. ఈ నెల 21న స్నేహితులతో కోలారు వెళ్లిన తిరుపతి యువకుడు, పవన్ కల్యాణ్ అభిమాన సంఘం నాయకుడు వినోద్ రాయల్ అక్కడే హత్యకు గురయ్యాడు. మరుసటి రోజు తిరుపతిలో అంత్యక్రియలు జరిగాయి. మొదటి నుంచీ పవన్ కల్యాణ్ అభిమాన సంఘం నాయకుడిగానూ, జనసేన పార్టీ కీలక నేతగానూ తిరుపతిలో సుపరిచితుడైన వినోద్‌రాయల్ ఇటీవల మునికోటి కుటుంబానికి పవన్ కల్యాణ్ రూ.2 లక్షలు అందజేసినప్పుడు కూడా ఉన్నాడు. వినోద్ రాయల్ హత్యోదంతం గురించి తెల్సుకున్న పవన్ కల్యాణ్ ఎంతో బాధపడ్డారనీ, తిరుపతికి బయల్దేరారని కిరణ్‌రాయల్ వివరించారు. -
పవన్ సభకు ‘ఫ్యాక్టరీ’ మహిళలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఒంగోలులో ఆదివారం సాయంత్రం జరిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు సింగరాయకొండలోని మాగుంటకు చెందిన ఫ్యాక్టరీ మహిళలను తరలించారు. మహిళల మద్దతు ఉందని చూపించేందుకు టీడీపీ నాయకులు పడరానిపాట్లు పడ్డారు. టీడీపీ తరఫున ఒంగోలు పార్లమెంటు నియోజకర్గం నుంచి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి సింగరాయకొండలో ఫ్యాక్టరీ ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అందులో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ప్రత్యేక వాహనంలో ఒంగోలు తరలించారు. పవన్‌కళ్యాణ్ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ కార్యకర్తలను ఒంగోలు తరలించారు. నగదు, మందు, పెట్రోల్ పవన్‌కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఒంగోలులోని నెల్లూరు బస్టాండుకు సమీపాన ఉన్న పెట్రోల్ బంకులో మోటార్‌సైకిళ్లకు ఉచితంగా పెట్రోల్ కొట్టించారు. మోటారుసైకిళ్లకు జనసేన, తెలుగుదేశం పార్టీల జెండాలు కట్టి నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో హడావిడి చేయించారు. మైక్ మొరాయింపుతో అసహనం ఏబీఎం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మైక్‌లు మొరాయించడంతో పవన్‌కళ్యాణ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయన ప్రసంగించడం మొదలు పెట్టగానే మైక్‌లు సరిగా లేకపోవడంతో ఒకటికి రెండుసార్లు వాటిని మార్చారు. అయినప్పటికీ అవి అలాగే ఉండటంతో ఒకానొక దశలో పవన్‌కళ్యాణ్ తనకు సమీపంలో వేదికపై ఉన్న స్పీకర్లను అటూఇటూ స్వయంగా కదిలించారు. ఒంగోలుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నల్లజెండాలతో నిరసన పవన్‌కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో అదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నల్ల జెండాలతో నిరసన తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డిపై పవన్‌కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసించారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని వారిని అక్కడ నుంచి బయటకు పంపించేశారు. టీడీపీకి ఝలక్.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్‌కళ్యాణ్ ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని జనసేన పార్టీ వ్యక్తని సభాముఖంగా వ్యాఖ్యానించారు. అంతలోనే ఆయన నాలుక్కరుచుకుని సరదాగా అన్నాను.. తెలుగుదేశం క్యాడర్ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొనడం విశేషం. సభా వేదిక నుంచి పవన్‌కళ్యాణ్ దిగే సమయంలో పట్టుతప్పి కిందపడబోయారు. నేటితో ప్రచారం సమాప్తం ఒంగోలు, న్యూస్‌లైన్ : రెండు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ కొన్నిరోజుల్లో తుది ఘట్టానికి చేరుకోబోతోంది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం 6 గంటలతో ప్రచార పర్వానికి తెరపడనుంది. రెండు నెలలకుపైగా విస్తృత ప్రచారం వరుస ఎన్నికలు వైఎస్సార్సీపీకి బాగా కలిసి వచ్చాయి. మార్చి 3వ తేదీ ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చిన సంగతి విదితమే. వెనువెంటనే సాధారణ ఎన్నికల షెడ్యూలు, మరో వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూలు కూడా రిలీజైంది. దీంతో పూర్తిస్థాయిలో ఎన్నికలకు సన్నద్ధమైన వైఎస్సార్సీపీ అభ్యర్థులు రణరంగంలోకి దిగారు. పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ చేసిన బాలినేని ప్రచారం కూడా వైఎస్సార్సీపీ జిల్లాలో బలపడడానికి కారణంగా నిలిచింది. వీటన్నింటికి తోడు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని అంశాలు పార్టీపై ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడానికి కారణంగా నిలిచాయి. మద్యం, డబ్బు పంపిణీపై ఆధారపడిన టీడీపీ జిల్లాలో వైఎస్సార్సీపీ గాలి బలంగా వీస్తుండడంతో టీడీపీ అభ్యర్థులు డబ్బు, మద్యాన్ని నమ్ముకుని ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటును రూ.500 నుంచి రూ.3,500 మధ్య కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. కనిపించని విశ్వాసం జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తున్నా ఆదరణ మాత్రం కనిపించడంలేదు. ఆదివారం ఏబీఎం కాంపౌండ్‌లో జరిగిన బహిరంగ సభను పరిశీలిస్తే పరిస్థితి అర్థం అవుతుంది. చంద్రబాబు గుట్టు లోకానికి ఎరుకైనా.. అబ్బే ఆయనకు మచ్చే లేదంటూ పవన్‌కళ్యాణ్ నమ్మించే యత్నం చేయడంతో ఆయనకు ఉన్న ఇమేజ్ కూడా ఒక్కసారిగా పడిపోయిందని మేథావులు విశ్లేషిస్తున్నారు.