టీడీపీపై కోపంతో అన్యాయం చేయకండి : పవన్‌ | Pawan Kalyan Urges Govt Of India To Respond Positively For AP SCS | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 20 2018 11:23 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Urges Govt Of India To Respond Positively For AP SCS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీపై ఉన్న కోపంతో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయవద్దని కేంద్రాన్ని జనసేన అధినేత పవన కల్యాణ్‌  కోరారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన ట్విటర్‌లో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని... హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలతో కలసి తాను కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. 

‘ఏపీ ప్రజల తరపున కేంద్రాన్ని కోరుతున్నా. పార్లమెంట్‌కు మించిన వేదిక మరొకటి లేదు.. మా హక్కుల గురించి అర్థం చేసుకోండి. దయచేసి న్యాయం చేయండి. టీడీపీపై ఉన్న కోపంతో ప్రత్యేక హోదాను నిరాకరించకండి. బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలు ఇచ్చిన మంచి అవకాశాన్ని వృథా చేసుకున్నారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల తరపున నిలబడాలి’ అని పవన్ వరుస ట్వీట్‌లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement