నేడు తిరుపతికి పవన్‌ కల్యాణ్‌ | today pawan kalyan came to tirupathi | Sakshi
Sakshi News home page

నేడు తిరుపతికి పవన్‌ కల్యాణ్‌

Published Thu, Aug 25 2016 12:27 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నేడు తిరుపతికి పవన్‌ కల్యాణ్‌ - Sakshi

నేడు తిరుపతికి పవన్‌ కల్యాణ్‌

– వినోద్‌ రాయల్‌ కుటుంబ సభ్యులకు పరామర్శ
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్‌ కల్యాణ్‌ గురువారం ఉదయం తిరుపతి రానున్నారు. ఈ నెల 21న కర్ణాటకలోని కోలారులో హత్యకు గురైన అభిమాని వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగే పవన్‌ కల్యాణ్‌ 10.45 గంటలకు తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని వినోద్‌ రాయల్‌ ఇంటికి చేరుకుంటారని పార్టీ జిల్లా ఇన్‌చార్జి, పవన్‌ కల్యాణ్‌ అభిమాన సంఘాల నాయకుడు కిరణ్‌ రాయల్‌ బుధవారం సాయంత్రం మీడియాకు తెలిపారు.
ఈ నెల 21న స్నేహితులతో కోలారు వెళ్లిన తిరుపతి యువకుడు, పవన్‌ కల్యాణ్‌ అభిమాన సంఘం నాయకుడు వినోద్‌ రాయల్‌ అక్కడే హత్యకు గురయ్యాడు. మరుసటి రోజు తిరుపతిలో అంత్యక్రియలు జరిగాయి. మొదటి నుంచీ పవన్‌ కల్యాణ్‌ అభిమాన సంఘం నాయకుడిగానూ, జనసేన పార్టీ కీలక నేతగానూ తిరుపతిలో సుపరిచితుడైన వినోద్‌రాయల్‌ ఇటీవల మునికోటి కుటుంబానికి పవన్‌ కల్యాణ్‌ రూ.2 లక్షలు అందజేసినప్పుడు కూడా ఉన్నాడు. వినోద్‌ రాయల్‌ హత్యోదంతం గురించి తెల్సుకున్న పవన్‌ కల్యాణ్‌ ఎంతో బాధపడ్డారనీ, తిరుపతికి బయల్దేరారని కిరణ్‌రాయల్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement