
కొత్తచెరువులో సాకే రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తున్న పవన్
సాక్షి, పుట్టపర్తి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఫ్లాప్ షోను తలపించింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన ఆయన...రోడ్డుమార్గంలో కొత్తచెరువుకు వచ్చారు. ఓ కుటుంబాన్ని పరామర్శించి 5 నిముషాల్లో పర్యటన ముగించుకుని ధర్మవరం వెళ్లిపోయారు.
పరామర్శలో ట్విస్ట్
పవన్ తొలుత కొత్తచెరువుకు చెందిన రైతు సమిటి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తారని ఆ పార్టీ స్థానిక నాయకులు రైతు కుటుంబానికి రెండు రోజుల కిందట సమాచారం ఇచ్చారు. అయితే రామకృష్ణ కుటుంబానికి వైఎస్సార్ రైతు బీమా సొమ్ము రూ.7 లక్షలను ప్రభుత్వం అందించిందని మంగళవారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురణ కావటంతో పవన్ రూటు మార్చారు. నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన కౌలు రైతు సాకే రామకృష్ణ భార్య సుజాతను పవన్ పరామర్శించారు. అది కూడా వంకరకుంట గ్రామానికి వెళ్లకుండా రైతు కుటుంబాన్నే కొత్తచెరువుకు రప్పించుకున్నారు.