సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టును తప్పుపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ వేదికగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘స్కిల్ స్కామ్ కేసులో పవన్‌కు ఏమి అర్థమైందో.. నా ప్రశ్నలకు ఒక్క పదంలో జవాబులు ఇవ్వండి’’ అంటూ సోమవారం ట్వీట్ చేశారు.
సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో అసలు స్కిల్ స్కామ్ జరిగిందా? లేదా?. ఒకవేళ స్కామ్ జరిగితే.. సీబీఎన్ (చంద్రబాబు)కు తెలియకుండా జరిగిందా?. రూ.300 కోట్లకుపైగా ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా, అధికారులు చెబుతున్నా వినకుండా విడుదల చేశారా?లేదా?. అప్పటి ప్రభుత్వ అధినేతగా చంద్రబాబుకు స్కామ్ జరిగిన తర్వాత విషయం తెలిసి ఉంటే వెంటనే దానిపై చర్యలు తీసుకోకపోవడం సరైనదేనా?.
దర్యాప్తులో సేకరించిన సమాచారాన్ని ఎఫ్‌ఐఆర్‌లో ఎప్పుడైనా ఎవరి పేరైనా చేర్చవచ్చన్న విషయం మీకు తెలీదా?. సీఐడీ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నమ్మి న్యాయమూర్తి బెయిల్ ఇవ్వకపోవడం తప్పా? సెక్షన్ 409 వర్తిస్తుందని చెప్పి రిమాండ్ విధించిన న్యాయమూర్తి అవినీతిపరురాలా? నాయకులంటే 40 ఏళ్లు బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి కాదు.. వాళ్లు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలీదా?’’ అంటూ ప్రశ్నలను పోస్టు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో ఏమి అర్థమైందో, దానిలోని తప్పులేంటో చెబుతూ పవన్ కెమెరావైపు చూస్తూ వీడియోను విడుదల చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment