సాక్షి, హైదరాబాద్ : శ్రీరాముడిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, హిందువుల మనోభావాలు దేబ్బతీసేలా మాట్లాడరని ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ మీద కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లు, హిందూ మతాన్ని కించపరిచేలా మట్లాడిన కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఉమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్‌పై కేసు నమోదు చేశారు.
ఇవే ఆరోపణలతో అడ్వొకేట్, హింధు సంఘటన్ అధ్యక్షుడు కరుణాసాగర్ కూడా మహేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ మీటింగ్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ మాట్లాడుతూ హిందు దేవతలను కించపరిచేలా వ్యవహరించారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కరుణాసాగర్ కోరారు. కాగా, గతంలో కూడా కత్తి మహేష్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపారు. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment