సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవడంపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి తనదైన శైలిలో స్పందించారు. వరుస పోస్టులతో విమర్శలు గుప్పించారు. ప్రగతి భవన్ లో పవన్ కళ్యాణ్ పడిగాపులు. ‘ముఖ్యమంత్రికి న్యూ ఇయర్ విషస్ చెప్పడానికా? అజ్ఞాతవాసి ప్రీమియర్ల పర్మిషన్ కా’ అని ప్రశ్నించారు.
‘తెలంగాణాలో 24 గంటల పవర్ ఎలా వస్తోందో తెలుసుకున్న పవర్ స్టార్...అబ్బా!!! పవర్ సర్ప్లస్ ఉంటే వస్తుంది. లేదా వేరే స్టేట్ నుంచి కొనుక్కుంటే వస్తుంది. లేదా ఆంధ్రప్రదేశ్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టులో భాగం అయితే ఉంటుంది. దీనికి ఒక పాలసీ స్టడీ. సరేగానీ, అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ ఎన్ని పడతాయో చెప్పు బ్రదర్ ఆఫ్ మెగాస్టార్ !’ అని సెటైర్ వేశారు.
"తెలంగాణాలో నా బలం నాకుంది" - పవన్ కళ్యాణ్
నిజమే నైజాం ఏరియా టోటల్ కలెక్షన్స్ లో 50% ఉంటుంది. ముఖ్యంగా హైప్ చేసి హైదరాబాద్ లో ప్రీమియర్ల పెడితే టికెట్టుకి 3,000 నుంచీ 5,000 లాగొచ్చు. అంత బలం ఉంది. ఆ బలానికి బలగం తోడు అవ్వాలంటే, కె.సి.ఆర్ అనుగ్రహం కావాలి. భేష్!!! అని మహేశ్ కత్తి ఆరోపించారు.
అవసరం, కాలం రాజకీయనాయకులను ఎంతటికైనా మారుస్తుందనడానికి కేసీఆర్-పవన్ భేటీ నిదర్శనమని దర్శకుడు రాంగోపాల్ వర్మ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment