
పవన్ కళ్యాణ్ పై కత్తి మహేశ్ మరోసారి గురిపెట్టారు. పవన్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఆడియో కార్యక్రమం నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియో విడుదల తర్వాత కత్తి మహేశ్ మరోసారి తనదైన రీతిలో సోషల్ మీడియాలో పవన్‌పై విరుచుకుపడ్డారు. ‘పాలిటిక్స్ గురించి క్లారిటీ రాలేదు సరే.. ఇప్పుడు సినిమాల మీద ఉన్న క్లారిటీ కూడా పోయినట్లు ఉందే.. ఆడియో ఫంక్షన్ అయిపోయింది. సినిమా బాగా అమ్ముడుపోయింది. రిలీజ్‌కి ఇంకా నెల టైముంది.
ఇకనైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడదామా..! కనీసం నెలైనా!!!’ అని మహేశ్ కత్తి తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఇప్పటివరకు కేవలం రాజకీయంగా మాత్రమే పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసిన మహేష్ కత్తి తాజాగా `అజ్ఞాతవాసి` సినిమా గురించి కూడా విమర్శలు ఎక్కుపెట్టాడు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment