
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే కలెక్షన్లు భారీగా పడిపోవటంతో డిస్టిబ‍్యూటర్‌లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఈ ఎఫెక్ట్ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌పై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు చిత్ర వర్గాలు. కథా కథనాలతో సంబంధం లేకుండా కేవలం పవన్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్ తోనే భారీ మొత్తాలకు అజ్ఞాతవాసి హక్కులు తీసుకున్నారు. దీంతో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మరోక్రేజీ కాంబినేషన్ ఫిలిం భరత్ అనే నేను. శ్రీమంతుడు లాంటి ఘనవిజయాన్ని అందించిన మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అజ్ఞాతవాసి రిజల్ట్ చూసిన తరువాత డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. అజ్ఞాతవాసి సమయంలో ఈ క్రేజ్ కారణంగా కటెంట్ గురించి పట్టించుకోకుండా సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ మరోసారి అదే తప్పు జరగకుండా జాగ్రత్త పడే పనిలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment