సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘భరత్ అనే నేను’. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. తాజాగా ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. సినిమాలో వాడిన రాజకీయ పార్టీ పేరు, గుర్తు కూడా తమదేనని నవోదయం పార్టీ అధ్యక్షుడు దాసరి రాము ఆరోపిస్తున్నారు.
తమ పార్టీకి ఎన్నికల గుర్తింపు కూడా ఉందని.. అలాంటిది పార్టీ పేరు, గుర్తు చిత్రంలో ఎలా ఉపయోగించారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై దర్శక, నిర్మాతలకు నోటీసులు పంపనున్నట్టు దాసరి రాము పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment