బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. త్రివిక్రమ్, పవన్‌ల కాంబినేషన్‌పై భారీ అంచనాలతో థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులు నిరాశగా వెనుతిరిగారు. ఎప్పుడు అర్థవంతమైన సంభాషణలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కించే త్రివిక్రమ్ ఇలాంటి సినిమా తీయటంపై అభిమానులు పెదవి విరిచారు.
ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు, ఆ సీన్స్‌లో పవన్ నటన, కొడకా కోటేశ్వరరావు పాటలోని పవన్ చేసిన స్టెప్స్ పై కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో గుడుంబా శంకర్, సర్థార్ గబ్బర్‌సింగ్ లాంటి సినిమాల్లోనూ ను పవన్ ఇలాంటి కామెడీ చేసి విమర‍్శలు ఎదుర్కొన్నాడు. పవన్ ఒత్తిడి వల్లే అజ్ఞాతవాసిలో త్రివిక్రమ్ తన స్టైల్‌కు పవన్ ఆలోచనలు జోడించి ఇలాంటి కామెడీ సీన్స్ చేసి ఉంటారంటున్నారు అభిమానులు.
Comments
Please login to add a commentAdd a comment