
కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కత్తి మహేష్‌కి సోషల్ మీడియా వేదికగా మాటలయుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కత్తిపై జరిగిన కోడిగుడ్ల దాడిపై చేసిన ఫిర్యాదు వెనక్కు తీసుకున్న అనంతరం పవన్ ఫ్యాన్స్ ఆయనతో సెల్ఫీలు దిగారు. దీంతో ఈ వివాదం తెరపడిందని అటు పవన్ ఫ్యాన్స్, ఇటు కత్తి మద్దతుదారులు అభిప్రాయపడ్డారు. తాజాగా కత్తి మరో మార్గంలో దూసుకుపోతున్నట్లు ఆయన చేసిన ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. కత్తి మహేష్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఆయన చేసిన పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది.
మహేష్ కత్తి ఇప్పటివరకు కేవలం తన వ్యక్తిగత హక్కుల కోసం పోరాడారు. అయితే కత్తి ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడదామని తన ట్విటర్ ద్వారా పిలుపునిచ్చారు. ‘ప్రత్యేక హోదా మాత్రమే కాదు. అన్ని విభజన హామీల గురించి పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇలాగే ఆలస్యం చేస్తే, వాటికి చట్టబద్దత నశించే ప్రమాదం ఉంద’ని ఆయన ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కి పవన్ అభిమాని ఒకరు ‘మేము పోరాడుతున్నాము, నువ్వు కూడా రా నీకు బాధ్యత లేదా, రాష్టాన్ని కాపాడుకునే హక్కు లేదా, నీ వ్యక్తిగత హక్కు కోసం పోరాడతావు, నీలో పోరాటపటిమ చాలా గొప్పది. మాతో రా.. జై జనసేన’ అని కామెంట్ చేశారు. దీనికి వెంటనే కత్తి స్పందించి ‘పవన్ కళ్యాణ్ పిలుపుని అందుకుని వైజాగ్ వచ్చినవాళ్ళలో నేనూ ఉన్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి’ అని రిప్లై ఇచ్చారు. తనకు వచ్చిన కామెంట్లకు కత్తి తనదైన శైలిలో రిప్లే ఇచ్చారు.
ప్రత్యేక హోదా మాత్రమే కాదు. అన్ని విభజన హామీల గురించి పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇలాగే ఆలస్యం చేస్తే,వాటికి చట్టబద్దత నశించే ప్రమాదం ఉంది.
— Kathi Mahesh (@kathimahesh) January 21, 2018