పూనమ్ కౌర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, సినిమా : తాజాగా నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది. "డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు... మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ... నీ గుణం ఏంటి?" అని ట్విటర్ వేదికగా ఆమె ప్రశ్న సంధించింది. ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలీదుగానీ ఇప్పుడిది హాట్ టాపిక్ అయ్యింది.
పబ్లిసిటీ కోసం ట్వీట్లు చేస్తున్నావా? అంటూ పలువురు ఆమెపై మండిపడుతున్నారు. ఇటీవలి కాలంలో కత్తి మహేష్, పవన్ అభిమానుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో పూనమ్ కౌర్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూనమ్ ట్వీట్‌పై దుమారం రేగుతోంది. అయితే ఈ ట్వీట్ ఎవరినీ ఉద్దేశించింది కాదని.. డబ్బు కోసం ఓ తండ్రి కూతురిని అమ్ముకుంటే.. ఆమె ఆవేదనను తాను ట్వీట్ చేశాను అంటూ పూనమ్ వివరణ ఇచ్చుకుంది.
పవన్ ఫ్యాన్స్ వార్నింగ్...
‘డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు’ అంటూ నటి పూనమ్ చేసిన కామెంట్‌పై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు తమ హీరోను ఉద్దేశించినవేనని భావిస్తూ... ఆమెపై నిప్పులు చెరుగుతున్నారు. సినిమాల గురించి ట్వీట్లు వేసుకుంటే బాగుంటుంది. నాటకాలు చేస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరికొందరు పూనమ్ కూడా టీవీ చానల్స్ చర్చా కార్యాక్రమాలకు వెళ్లాలని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
Dabbul kosam maripoina siddantalu..me astitvam Enti ?avasarlu kosam maripoina nijayati ni gunam Enti ??? #justathought
— Poonam Kaur Lal (@poonamkaurlal) 27 January 2018
Comments
Please login to add a commentAdd a comment