పవన్‌కు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్‌ | Prakash Raj Reacts On Pawan Kalyan Comments On Him, Watch Video Inside Goes Viral | Sakshi
Sakshi News home page

Tirupati Laddu Row: పవన్‌కు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్‌

Published Tue, Sep 24 2024 3:10 PM | Last Updated on Tue, Sep 24 2024 4:31 PM

Prakash Raj Comments On Pawan Kalyan Tweet

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నటుడు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్‌ ఇచ్చారు. తిరుమల  లడ్డు వివాదంపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పవన్‌.. ప్రకాష్‌ రాజ్‌పై విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రకాష్‌ రాజ్‌ స్పందిస్తూ.. పవన్‌కు కౌంటర్‌ ఇచ్చారు.  

‘పవన్‌ .. నేను చేసిన ట్వీట్‌ ఏంటి? నా ట్వీట్‌పై మీరు మాట్లాడుతుందంటేంటి. మరోసారి నా ట్వీట్‌ను చదవి అర్థం చేసుకోండి. నేను షూటింగ్ నిమిత్తం విదేశాల్లో వున్నాను 30 తేదీ తరువాత వస్తాను. మీ ప్రతి మాటకు సమాధానం చెపుతాను. మీకు వీలైతే నా ట్వీట్‌ని మళ్లీ చదివి అర్థం చేసుకోండి’ అంటూ వీడియోని విడుదల చేశారు. 

 

ట్వీట్‌లో ప్రకాష్‌ రాజ్‌ ఏమన్నారంటే
పవన్ కల్యాణ్... మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు? ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

 

ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌పై పవన్‌ ఇలా మాట్లాడారు
సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

చదవండి:  పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement