కత్తి మహేశ్‌ చూపు.. చంద్రబాబు వైపు | mahesh kathi comments on ap cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

కత్తి మహేశ్‌ చూపు.. చంద్రబాబు వైపు

Published Sun, Dec 24 2017 9:35 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

mahesh kathi comments on ap cm chandrababu naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన చూపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైపు మళ్ళింది. దేవాలయాల్లో జనవరి ఒకటిన ప్రత్యేక పూజలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మనకు నూతన సంవత్సరం జనవరిలో కాదు, ఉగాది పర్వాదిన ఆరంభం అవుతుందని పేర్కొంది.

ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై మహేశ్‌ కత్తి తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ఆయన స్పందించారు. ‘చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది. రాజధాని మాత్రం అంతర్జాతీయం కావాలి. కొత్త సంవత్సరం మాత్రం జనవరిలో వద్దు. మూర్ఖత్వానికి పరాకాష్ట. హిందుత్వ రాజకీయాలకు తెరతీత. సిగ్గుసిగ్గు !’ అని మహేశ్‌ కత్తి పోస్టు చేశారు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్‌, పవన్‌ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. 

కత్తి మహేశ్‌ చూపు.. చంద్రబాబు వైపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement