సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమల లడ్డూ విశిష్టతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టింది. భారీ ఎత్తున గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పూజలు చేస్తున్నారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష ప్రత్యేక పూజలు చేశారు.
దేవుడు ప్రసాదంతో చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలి: నారాయణ స్వామి, మాజీ డిప్యూటీ సిఎం
తిరుపతి జిల్లా: అంజేరమ్మ కనుమ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్ కృపాలక్ష్మీ
చంద్రబాబు నాయుడు దేవుడు ప్రసాదంతో రాజకీయాలు మానుకోవాలిచంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అమ్మవారిని పూజలు చేశాం
తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి హోదాలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పట్టు వస్త్రాలు అందించే అదృష్టం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికే దక్కింది
చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడు,ప్రజలే తగిన బుద్ధి. చెబుతారు
ఒక మాజీ ముఖ్యమంత్రి నీ తిరుమల శ్రీవారు దర్శనం కు రానివ్వకుండా అడ్డుకున్నారు అంటే మీప్రభుత్వంలో ఇక దళితులకు ఏం రక్షణ ఉంటుంది
ఇప్పటికే దళితులకు చాలా చోట్ల గ్రామాల్లో దేవలయల్లోకి అనుమతిలేదు.
నిన్న జరిగిన సంఘటనతో కుల,మతోన్మాద శక్తులు మరింత రెచ్చిపోతారు
చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని అంజేరమ్మ తల్లి ను కోరాను
-నారాయణ స్వామి
చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించు వెంకన్నస్వామీ: భూమన
చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ పూజలు నిర్వహించారు. అనంతరం భూమన మాట్లాడుతూ, తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ అపవాదు వేశారని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు వాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను శ్రీవారి దర్శనానికి రాకుండా అడ్డుకున్నారు. ఆయన స్వామివారిని ఎన్నో సార్లు దర్శనం చేసుకున్నారు. రాజకీయ ప్రాబల్యం కోసం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
గుంటూరు జిల్లా: గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఏలూరు జిల్లా: తిరుపతి లడ్డు పవిత్రతను.. దెబ్బతీస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసనగా చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామవరపుకోట వీరభద్రస్వామి ఆలయంలో చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు, మద్ది ఆంజనేయస్వామి గుడి మాజీ చైర్మన్ సరితారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వినర్ మిడతా రమేష్, పార్టీ శ్రేణులు పూజలు నిర్వహించారు.
తూర్పుగోదావరి: చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేయడానికి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పూజలు చేశారు. బొమ్మూరు ఆలయంలో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాజానగరం ఆలయంలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పూజలు నిర్వహిస్తున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లిలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు.
కర్నూలు జిల్లా: తిరుమల లడ్డులో కల్తీ జరిగినట్టుగా అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు కల్లూరు అర్బన్ కృష్ణ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాష్ట్రంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్సార్ జిల్లా: యర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో చంద్రబాబు తిరుమల లడ్డూపై చేసిన దుష్ప్రచారానికి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. లడ్డూ పవిత్రతను కాపాడే విధంగా అభిషేకాలు చేశారు.
అనంతపురం జిల్లా: చంద్రబాబు పాపం ప్రజలపై పడకూడదని వైఎస్సార్‌సీపీ నేతలు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం శ్రీకంఠం సర్కిల్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో స్వామి వారికి పూజలు జరిగాయి. తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం మాజీ సీఎం వైఎన్ జగన్ వెళ్తుంటే.. అనుమతి లేదని చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం బాధాకరం అని, తిరుమల లడ్డూలపై అసత్య చేసిన చంద్రబాబును ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని అనంతవెంకటరామిరెడ్డి అన్నారు.
విజయవాడ: తిరుమల పవిత్రతను,శ్రీవారి ప్రసాదం విశిష్టతను, టీటీడీ పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం విజయవాడలో వైఎస్సార్‌సీపీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. లబ్బీపేటలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూజలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. దాసాంజనేయ స్వామి ఆలయంలో సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు చేశారు.
డిక్లరేషన్ ఎందుకివ్వాలి: దేవినేని అవినాష్
ఇది మంచి ప్రభుత్వం కాదు.. ప్రజలను నిండా ముంచిన ప్రభుత్వం. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశారు. పరిపాలనలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు. అనేక మార్లు తిరుమల వెళ్లిన వైఎస్ జగన్.. డిక్లరేషన్ ఎందుకివ్వాలి. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబు, టీడీపీకే చెల్లుబాటు. నేను విదేశాల్లో చదువుకున్నప్పుడు ఏపీ గురించి గొప్పగా చెప్పుకునే వారు. ఈ రోజు చంద్రబాబు వల్ల రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతింది. వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో విఫలం చెందారు.
ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే
⇒తిరుమల పవిత్రతను, వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విశిష్టతను, స్వామి వారి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు అపవిత్రం చేశారు. చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో నేడు ప్రత్యేక పూజలు చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
⇒‘‘చంద్రబాబు చేసిన పాపం వల్ల వెంకటేశ్వరస్వామికి కోపం వచ్చి రాష్ట్రంపై చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి. ఎందుకంటే జరిగింది ఘోర అపచారం. వెంకటేశ్వరస్వామిని పలుచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ.. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వు వాడనిది వాడినట్లుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్లుగా పచ్చి అబద్ధాలాడుతూ ఇంత ఘోరం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆ పాపం కడగబడాలి. అందుకే అందరినీ కోరుతున్నా. పూజలు చేయమని వేడుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment