special poojas
-
రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ
బెంగళూరు: బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తితో కలిసి బెంగళూరులో పర్యటించారు. కార్తీక మాసం పవిత్రమైన మాసం కావడంతో గురురాఘవేంద్ర స్వామి ఆశీస్సులు పొందేందుకు ఈ దంపతులు మఠాన్ని సందర్శించారు. జయనగర్‌లో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు సునక్ అత్తమామలు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా దర్శనమిచ్చాయి. స్వామివారి దర్శనం సందర్భంగా ఆలయ సంప్రదాయ పూజల్లో వారు పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాలపై తన విశ్వాసం గురించి బహిరంగంగానే ప్రకటించే రిషి సునాక్.. గతంలో దేశంలో పర్యటించినప్పుడు అనేక దేవాలయాలను సందర్శించారు. ఈ ఏడాది జనవరిలో సునాక్ లండన్‌లోని ప్రఖ్యాత బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్‌ను సందర్శించారు. ‘‘నేను హిందువును. అందరిలాగే, నేనూ నా విశ్వాసం నుంచి ప్రేరణను, ఓదార్పును పొందుతాను. పార్లమెంటు సభ్యుడిగా ‘భగవద్గీత’పై ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. -
ఏపీవ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్సీపీ నేతల పూజలు (ఫొటోలు)
-
Watch: ‘చంద్రబాబును క్షమించి మంచి బుద్ధిని ప్రసాదించు వెంకన్నస్వామీ’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమల లడ్డూ విశిష్టతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. భారీ ఎత్తున గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పూజలు చేస్తున్నారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష ప్రత్యేక పూజలు చేశారు.దేవుడు ప్రసాదంతో చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలి: నారాయణ స్వామి, మాజీ డిప్యూటీ సిఎంతిరుపతి జిల్లా: అంజేరమ్మ కనుమ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గం ఇన్చార్జ్ కృపాలక్ష్మీచంద్రబాబు నాయుడు దేవుడు ప్రసాదంతో రాజకీయాలు మానుకోవాలిచంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అమ్మవారిని పూజలు చేశాంతిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి హోదాలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పట్టు వస్త్రాలు అందించే అదృష్టం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికే దక్కిందిచంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడు,ప్రజలే తగిన బుద్ధి. చెబుతారుఒక మాజీ ముఖ్యమంత్రి నీ తిరుమల శ్రీవారు దర్శనం కు రానివ్వకుండా అడ్డుకున్నారు అంటే మీప్రభుత్వంలో ఇక దళితులకు ఏం రక్షణ ఉంటుందిఇప్పటికే దళితులకు చాలా చోట్ల గ్రామాల్లో దేవలయల్లోకి అనుమతిలేదు.నిన్న జరిగిన సంఘటనతో కుల,మతోన్మాద శక్తులు మరింత రెచ్చిపోతారుచంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని అంజేరమ్మ తల్లి ను కోరాను-నారాయణ స్వామిచంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించు వెంకన్నస్వామీ: భూమనచంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ పూజలు నిర్వహించారు. అనంతరం భూమన మాట్లాడుతూ, తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ అపవాదు వేశారని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు వాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను శ్రీవారి దర్శనానికి రాకుండా అడ్డుకున్నారు. ఆయన స్వామివారిని ఎన్నో సార్లు దర్శనం చేసుకున్నారు. రాజకీయ ప్రాబల్యం కోసం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.గుంటూరు జిల్లా: గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆలయంలో పూజలు నిర్వహించారు.ఏలూరు జిల్లా: తిరుపతి లడ్డు పవిత్రతను.. దెబ్బతీస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసనగా చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామవరపుకోట వీరభద్రస్వామి ఆలయంలో చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు, మద్ది ఆంజనేయస్వామి గుడి మాజీ చైర్మన్ సరితారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వినర్ మిడతా రమేష్, పార్టీ శ్రేణులు పూజలు నిర్వహించారు.తూర్పుగోదావరి: చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేయడానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పూజలు చేశారు. బొమ్మూరు ఆలయంలో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాజానగరం ఆలయంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పూజలు నిర్వహిస్తున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లిలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు.కర్నూలు జిల్లా: తిరుమల లడ్డులో కల్తీ జరిగినట్టుగా అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు కల్లూరు అర్బన్ కృష్ణ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాష్ట్రంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.వైఎస్సార్ జిల్లా: యర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో చంద్రబాబు తిరుమల లడ్డూపై చేసిన దుష్ప్రచారానికి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. లడ్డూ పవిత్రతను కాపాడే విధంగా అభిషేకాలు చేశారు.అనంతపురం జిల్లా: చంద్రబాబు పాపం ప్రజలపై పడకూడదని వైఎస్సార్సీపీ నేతలు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం శ్రీకంఠం సర్కిల్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో స్వామి వారికి పూజలు జరిగాయి. తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం మాజీ సీఎం వైఎన్ జగన్ వెళ్తుంటే.. అనుమతి లేదని చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం బాధాకరం అని, తిరుమల లడ్డూలపై అసత్య చేసిన చంద్రబాబును ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని అనంతవెంకటరామిరెడ్డి అన్నారు.విజయవాడ: తిరుమల పవిత్రతను,శ్రీవారి ప్రసాదం విశిష్టతను, టీటీడీ పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం విజయవాడలో వైఎస్సార్సీపీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. లబ్బీపేటలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూజలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. దాసాంజనేయ స్వామి ఆలయంలో సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు చేశారు. డిక్లరేషన్ ఎందుకివ్వాలి: దేవినేని అవినాష్ ఇది మంచి ప్రభుత్వం కాదు.. ప్రజలను నిండా ముంచిన ప్రభుత్వం. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశారు. పరిపాలనలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు. అనేక మార్లు తిరుమల వెళ్లిన వైఎస్ జగన్.. డిక్లరేషన్ ఎందుకివ్వాలి. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబు, టీడీపీకే చెల్లుబాటు. నేను విదేశాల్లో చదువుకున్నప్పుడు ఏపీ గురించి గొప్పగా చెప్పుకునే వారు. ఈ రోజు చంద్రబాబు వల్ల రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతింది. వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో విఫలం చెందారు.ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే ⇒తిరుమల పవిత్రతను, వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విశిష్టతను, స్వామి వారి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు అపవిత్రం చేశారు. చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో నేడు ప్రత్యేక పూజలు చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.⇒‘‘చంద్రబాబు చేసిన పాపం వల్ల వెంకటేశ్వరస్వామికి కోపం వచ్చి రాష్ట్రంపై చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి. ఎందుకంటే జరిగింది ఘోర అపచారం. వెంకటేశ్వరస్వామిని పలుచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ.. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వు వాడనిది వాడినట్లుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్లుగా పచ్చి అబద్ధాలాడుతూ ఇంత ఘోరం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆ పాపం కడగబడాలి. అందుకే అందరినీ కోరుతున్నా. పూజలు చేయమని వేడుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
శ్రీశైలంలో సీజేఐ ఎన్వీ రమణ ప్రత్యేక పూజలు
-
వర్షాల కోసం కృష్ణమ్మ జలాలు తీసుకువచ్చి ....
-
వామ్మో.. 3,700 కిలోల మహా గంట
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పురాతన ఆలయానికి భారీ గంటను భక్తులు అందించారు. ఏకంగా మూడున్నర క్వింటాళ్ల బరువున్న గంటను ఆలయానికి ఊరేగింపుగా తరలించారు. మధ్యప్రదేశ్‌లోని మందసార్ జిల్లాలోని పశుపతినాథ్ ఆలయానికి ఆ గంటను బహూకరించారు. అంతకుముందు భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల విరాళాలు.. సహకారంతో ఈ మహాగంటను ఆలయానికి చేర్చారు. పశుపతినాథ్ ఆలయంలో శివుడు అష్టముఖి లింగాకారంలో ఉంటాడు. అందుకే ప్రసిద్ధి పొందింది. వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయానికి గంటను అందించారు. ఈ మహా గంట ఏకంగా 3,700 కిలోల బరువుతో ఉంది. శ్రీకృష్ణ కామధేను సంస్థ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ మహాగంటను తయారుచేశారు. ఈ గంటను రామేశ్వరం నుంచి ఊరేగింపుగా మధ్యప్రదేశ్‌లోని మాందసర్ వరకు తీసుకెళ్లారు. 2015లో మొదలైన ఈ గంట గతేడాది పూర్తయ్యింది. అనంతరం ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఊరేగించి చివరకు పశుపతి నాథ్ ఆలయానికి తీసుకొచ్చారు. -
కరోనా అరికట్టేందుకు శారదా పీఠంలో యాగం
-
వైభవంగా అమరావతి అమరేశ్వరుడి రథోత్సవం
-
మల్లన్న ఆలయంలో నందీశ్వరుడికి అభిషేకాలు
-
గండిలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
-
మదగలమ్మకు ప్రత్యేక హోమాలు
చిలమత్తూరు : స్థానిక ఎస్సీ కాలనీలో వెలసిన మదగలమ్మకు శుక్రవారం ప్రత్యేక హోమాలు జరిగాయి. అర్చకులు లక్ష్మీనరసింహప్రసాద్, కిశోర్‌శర్మ, మంజునాథ్ ¶కలశపూజ, పంచామృతాభిషేకాలు, దేవిమూల మంత్రహోమాలు, పూర్ణాహుతి, కుంభాభిషేకం, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు కదిరెప్ప, లక్ష్మీనరసప్ప, సత్యనారాయణ, కదిరెప్ప తదితరులు తెలిపారు. -
అమ్మవారి శాలలో వైఎస్ జగన్ పూజలు
-
చెన్నై త్వరగా కోలుకోవాలంటూ పూజలు
-
వర్షం కోసం ప్రత్యేక పూజలు
బేతంచెర్ల (కర్నూలు): కర్నూలు జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని బుగ్గానిపల్లె గ్రామంలో వర్షం కోసం కనుమ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం గ్రామంలోని మహిళలు, రైతులు భక్తి శ్రద్ధలతో ఆలయం వరకు తరలి వచ్చి కనుమ ఆంజనేయస్వామి అభిషేకం, ఆకుపూజ, కుంకమార్చన, మహా మంగళ హారతి నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులవుతున్నా వర్షం పడకపోవడంతో వరుణ దేవుని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాముడు,రామచంద్రుడు, గోరంట్ల, జయరాముడు, వెంకటసుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి బీరప్ప జాతర ప్రారంభం
మెదక్: జహీరాబాద్ మండలంలోని గొడిగార్‌పల్లి గ్రామ శివారులో వెలిసిన శ్రీ బీరప్ప జాతర ఉత్సవాలు శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం.. శనివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు బోనాల ఊరేగింపు ప్రారంభమౌతుంది. సర్వదర్శనం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తీర్థప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి గొల్లబీర్ల వారి ఉగ్గు కథా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉదయం 11 గంటలకు స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమం కనుల విందుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం 12 గంటలకు తీర్థప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. (జహీరాబాద్) -
యాదగిరీశునికి సువర్ణ పుష్పార్చన
తెలంగాణ తిరుపతిగా రూపుదిద్దుకోనున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం స్వామి, అమ్మవార్లకు సువర్ణ పుష్పార్చన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాలు, పంచోపనిషత్తులు, పంచసూక్తాలతో అభిషేకించి పట్టువస్త్రాలను ధరింపచేశారు. వివిధ రకాలైన పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి 108 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన చేశారు. -
మహా నిమజ్జనం సందడి
-
ఘనంగా మహంకాళి బోనాలు
కాజీపేటలో సందడే సందడి * అమ్మవారికి మొక్కులు * చెల్లించుకున్న భక్తులు * ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు కాజీపేట: పట్టణ శివారు సోమిడిలోని మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఆషాఢమాసం చివరి ఆదివారం ఎంతో అట్టహాసంగా నిర్వహించే ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని ద ర్శించుకున్నారు. ఆలయ పూజారి ముత్యాల సరస్వతి, రాజు, లక్ష్మణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో దేవాలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. విష్ణుపురి సబర్మతి పాఠశాల, వెంకటాద్రినగర్, బాపూజీనగర్, ప్రశాంత్‌నగర్‌లో అమ్మవారికి మహిళలు మంగళహారతులతో ఎదురేగి మొక్కులు సమర్పించుకున్నారు. కాంగ్రెస్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి సాంబయ్య, టీఎన్టీయూసీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అంకూస్ అమ్మవారికి పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు. వీరితోపాటు పలువురు రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆకట్టుకున్న నృత్యాలు.. డప్పు వాయిద్యాల మోతలు, చిందు కళాకారులు, పోతరాజులు చేసిన నృత్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. దేవతామూర్తుల వేషధారణలతో చిందు కళాకారులు ఊరేగింపు అగ్రభాగాన నిలిచి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరూరి సాంబయ్య, గౌని సాంబయ్యగౌడ్, రాంచరణ్‌తేజ్ అభిమాన సంఘం పట్టణ అధ్యక్షుడు క్రాంతికుమార్, బక్కతట్ల మోహన్, బుర్ర తిరుపతి, స్థానిక పెద్దలు ధర్మయ్య, శ్రీనివాస్, ఎండీ అలీసాహెబ్, యాదగిరి, గద్దె సతీష్ పాల్గొన్నారు. -
ఏరువాక సాగింది...
విఘ్నేశ్వరా ఈ ఏడాదైనా సాగుకు ఆటంకం లేకుండా చూడు.. భూమాతా మా ఇంట ధాన్యరాశులు నిండాలని దీవించు.. అంటూ అన్నదాతలు వేడుకున్నారు. వ్యవసాయ పరికరాలను, వృషభ రాజులను పూజించి సాగుకు శ్రీకారం చుట్టారు. హలాల నెత్తుకుని పొలాలకు బయలుదేరిన ఇంటి యజమానులకు మహిళలు హారతులిచ్చారు. జ్యేష్ట శుద్ధ పౌర్ణమి రోజున ఏటా ఏరువాక పండుగను ఘనంగా నిర్వహించుకోవడం గ్రామాల్లో ఆనవాయితీ. ఈ సందర్భంగా శుక్రవారం నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో ఏరువాక ఇలా సాగింది.. నరసరావుపేట రూరల్ : ఏరువాక సాగింది.. కర్షకుల కళ్లల్లో ఆనందం ఉప్పొంగింది.. భూమితల్లి మురిసిపోయింది. తమ ఇంటి యజమానులు పొలాల వెంట బయలుదేరుతుంటే మహిళాలోకం హారతి పట్టింది. పెద్దా, చిన్న, సన్నకారు రైతులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు వృషభరాజులకు ప్రత్యేక పూజలు చేసి హలాలు భుజానెత్తుకొని కోటి ఆశతో సాగు పనులు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఏరువాక జేష్ట శుద్ధ పౌర్ణమినాడు పండుగను ఘనంగా నిర్వహించుకోవడం మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరా.. ఈ ఏడాదైనా మా సాగుకు, మా ఇంట దిగుబడురాసులకు విఘాతం కలిగించవద్దు అని వేడుకుంటూ గ్రామాల్లోని గణపతి ఆలయాల్లో రైతులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని యల్లమంద, పాలపాడు, పెదరెడ్డిపాలెం, కేసానుపల్లి, పెట్లూరివారిపాలెం, ఇక్కుర్రు, పమిడిపాడు, కొండకావూరు, గురవాయిపాలెం తదితర ప్రాంతాల్లో ఏరువాక సాగింది. అన్నదాతలు ముల్లుకర్ర చేతపట్టి, మర్రి ఆకులు మరచెంబులో నీరు, విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించారు. నలుదిక్కులా పసుపు, కుంకుమ వెదజల్లి సాగుకు శ్రీకారం చుట్టారు. యల్లమంద గ్రామంలో వందలాదిమంది మహిళలు నూతన వస్త్రాలు ధరించి విఘ్నేశ్వరాలయం వరకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆడపడుచులు తమ పుట్టింటికి వచ్చి సేద్యానికి సహకారం అందించే వ్యవసాయ పనిముట్లు, అరకలు, ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు.