
యాదగిరీశునికి సువర్ణ పుష్పార్చన
తెలంగాణ తిరుపతిగా రూపుదిద్దుకోనున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం స్వామి, అమ్మవార్లకు సువర్ణ పుష్పార్చన ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాలు, పంచోపనిషత్తులు, పంచసూక్తాలతో అభిషేకించి పట్టువస్త్రాలను ధరింపచేశారు. వివిధ రకాలైన పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి 108 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన చేశారు.