రేపటి నుంచి బీరప్ప జాతర ప్రారంభం
మెదక్: జహీరాబాద్ మండలంలోని గొడిగార్‌పల్లి గ్రామ శివారులో వెలిసిన శ్రీ బీరప్ప జాతర ఉత్సవాలు శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం.. శనివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు బోనాల ఊరేగింపు ప్రారంభమౌతుంది. సర్వదర్శనం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తీర్థప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.
రాత్రి గొల్లబీర్ల వారి ఉగ్గు కథా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉదయం 11 గంటలకు స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమం కనుల విందుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం 12 గంటలకు తీర్థప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.
(జహీరాబాద్)