వామ్మో.. 3,700 కిలోల మహా గంట | Heavy Weight Bell to Pashupathinath Temple in UP | Sakshi
Sakshi News home page

వామ్మో.. 3,700 కిలోల మహా గంట

Published Wed, Feb 17 2021 10:32 PM | Last Updated on Wed, Feb 17 2021 10:33 PM

Heavy Weight Bell to Pashupathinath Temple in UP - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని పురాతన ఆలయానికి భారీ గంటను భక్తులు అందించారు. ఏకంగా మూడున్నర క్వింటాళ్ల బరువున్న గంటను ఆలయానికి ఊరేగింపుగా తరలించారు. మధ్యప్రదేశ్‌లోని మందసార్‌ జిల్లాలోని పశుపతినాథ్‌ ఆలయానికి ఆ గంటను బహూకరించారు. అంతకుముందు భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల విరాళాలు.. సహకారంతో ఈ మహాగంటను ఆలయానికి చేర్చారు.

పశుపతినాథ్‌ ఆలయంలో శివుడు అష్టముఖి లింగాకారంలో ఉంటాడు. అందుకే ప్రసిద్ధి పొందింది. వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయానికి గంటను అందించారు. ఈ మహా గంట ఏకంగా 3,700 కిలోల బరువుతో ఉంది. శ్రీకృష్ణ కామధేను సంస్థ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ మహాగంటను తయారుచేశారు. ఈ గంటను రామేశ్వరం నుంచి ఊరేగింపుగా మధ్యప్రదేశ్‌లోని మాందసర్‌ వరకు తీసుకెళ్లారు. 2015లో మొదలైన ఈ గంట గతేడాది పూర్తయ్యింది. అనంతరం ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఊరేగించి చివరకు పశుపతి నాథ్‌ ఆలయానికి తీసుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement