Pashupatinath temple
-
పశుపతినాథ క్షేత్రం.. జింక కొమ్ము పట్టుకుని లాగడంతో!
భారతదేశానికి వెలుపల ఉన్న శివాలయాలలో నేపాల్ రాజధాని కఠ్మాండులోని పశుపతినాథ క్షేత్రం ప్రాచీనమైనది. పురాణేతిహాసాల్లో ఈ క్షేత్రం ఆవిర్భావం గురించి కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి శివుడు పార్వతీ సమేతంగా కాశీ నుంచి బయలుదేరి, భాగామతి నదీతీరంలో మృతస్థలి అనే ప్రదేశంలో జింకరూపంలో నిద్రించగా, శివుడిని తిరిగి కాశీకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో దేవతలు జింక కొమ్ము పట్టుకుని లాగారట. అప్పుడు ఆ కొమ్ము నాలుగు ముక్కలుగా విరిగి అక్కడ పడిందట. ఆ నాలుగు ముక్కలూ పడిన చోటే చతుర్ముఖ శివలింగం వెలసింది. ఈ ప్రాంతమే పశుపతినాథ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది అని చెబుతారు. పశుపతినాథ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందనే దానిపై సరైన ఆధారాలేవీ లేవు. నేపాల్‌ను పరిపాలించిన రాచవంశానికి చెందిన ‘గోపాలరాజ వంశావళి’లో ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆలయం క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటి నుంచే ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. పగోడాలా కనిపించే ఈ ఆలయం పైకప్పులపై బంగారు, రాగి తాపడం, ప్రధాన ద్వారాలకు వెండితాపడం కనిపిస్తాయి. ఈ ఆలయంలో దక్షిణభారత పూజారులే నిత్యార్చనలు జరపడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. భారత్ నుంచి కూడా వేలాదిమంది భక్తులు ఇక్కడకు తరలివస్తారు. -
వామ్మో.. 3,700 కిలోల మహా గంట
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పురాతన ఆలయానికి భారీ గంటను భక్తులు అందించారు. ఏకంగా మూడున్నర క్వింటాళ్ల బరువున్న గంటను ఆలయానికి ఊరేగింపుగా తరలించారు. మధ్యప్రదేశ్‌లోని మందసార్ జిల్లాలోని పశుపతినాథ్ ఆలయానికి ఆ గంటను బహూకరించారు. అంతకుముందు భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల విరాళాలు.. సహకారంతో ఈ మహాగంటను ఆలయానికి చేర్చారు. పశుపతినాథ్ ఆలయంలో శివుడు అష్టముఖి లింగాకారంలో ఉంటాడు. అందుకే ప్రసిద్ధి పొందింది. వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయానికి గంటను అందించారు. ఈ మహా గంట ఏకంగా 3,700 కిలోల బరువుతో ఉంది. శ్రీకృష్ణ కామధేను సంస్థ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ మహాగంటను తయారుచేశారు. ఈ గంటను రామేశ్వరం నుంచి ఊరేగింపుగా మధ్యప్రదేశ్‌లోని మాందసర్ వరకు తీసుకెళ్లారు. 2015లో మొదలైన ఈ గంట గతేడాది పూర్తయ్యింది. అనంతరం ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఊరేగించి చివరకు పశుపతి నాథ్ ఆలయానికి తీసుకొచ్చారు. -
భారత నేతలతో నేపాల్‌కు ఆదాయం
సాక్షి, న్యూఢిల్లీ : నేపాల్ పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరుగు టపాలో ఆగస్టు 31వ తేదీన కఠ్మాండుకు సమీపంలోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించిన విషయం తెల్సిందే. ఆయన 2014లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పశుపతినాథ్ ఆలయాన్ని ఆయన సందర్శించడం ఇది మూడవ సారి. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున కూడా ఆయన ఆ ఆలయాన్ని సందర్శించారు. హిందూ ఓటర్లను ఆకర్షించడం కోసమే ఆయన ఆ రోజు అక్కడికి వెళ్లారంటూ వార్తలు రావడమే కాకుండా కర్ణాటక కోస్తా ప్రాంతంలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి ఆయన ఆలయ సందర్శన దోహదపడిందని పార్టీ వర్గాలే పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31వ తేదీన పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించుకున్న రోజునే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మానససరోవర యాత్రలో భాగంగా కఠ్మాండు చేరుకున్నారు. ఇలా పాలక, ప్రతిపక్ష నేతలు విదేశీ పర్యటనలో ఒకే నగరంలో ఉండడం చాలా అరుదు. ఆరోజున రాహుల్ గాంధీ కూడా పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించుకోవాల్సి ఉంది. అయితే రాహుల్ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని నేరుగా టిబెట్‌లోని లాసా ప్రాంతానికి బయల్దేరి వెళ్లారు. అందుకు కారణాలు అధికారికంగా ఎవరూ వెల్లడించలేదుగానీ ప్రధాని మోదీ ఆలయానికి వస్తున్నారని తెలిసే రాహుల్ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని తెల్సింది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ హెలికాప్టర్ సాంకేతిక లోపానికి గురై కుదుపులకు గురవడం, అందులో నుంచి రాహుల్ గాంధీ క్షేమంగా బయట పడడం తెల్సిందే. అందుకు కృతజ్ఞతగా ఇప్పుడు ఆయన మానస సరోవరం యాత్రను చేపట్టారట. ప్రధాని నరేంద్ర మోదీ పశపతినాథ్ ఆలయ సందర్శనకు ముందు మాజీ భారత ప్రధాన మంత్రి హెచ్డీ దేవగౌడ తన కుటుంబం సమేతంగా పశపతినాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. భారత రాజకీయ నాయకులు ఓట్ల కోసం పశపతినాథ్ ఆలయాన్ని సందర్శిస్తుంటే ప్రచారం పెరిగి భారత్‌లోని హిందువులు కూడా ఆ ఆలయానికి క్యూ కడుతున్నారట. ఈ ఏడాది భారతీయ యాత్రికులు 20 శాతం పెరిగి తమ పర్యాటక రంగానికి ఆదాయం కూడా పెరిగిందని నేపాల్ టూరిజం బోర్డు అధిపతి దీపక్ రాజ్ జోషి తెలిపారు. మానససరోవర యాత్రకు బయల్దేరిన భారతీయుల్లో ఇప్పటికే ఆరువేల మంది యాత్రికులు నేపాల్‌గంజ్ మీదుగా వెళ్లారట. మానససరోవరానికి నేపాల్ ‘గేట్‌వే’లా పనిచేస్తున్న విషయం తెల్సిందే. ఆ యాత్రకు వెళ్లేందుకు నేపాల్ మీదుగా ఇదివరకు మూడు దారులు ఉండగా, 2015లో సంభవించిన పెను భూకంపం కారణంగా రెండు దారులు మూసుకుపోగా, ఇప్పుడు నేపాల్‌గంజ్–హుమ్లా మార్గమే మిగిలింది. నాడు సోనియాను అనుమతించలేదు... 1988లో అప్పటి భారత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ సోనియా గాంధీతో కలసి నేపాల్ పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఆ దంపతులు పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ క్రైస్తవ మతానికి చెందడం వల్ల అందుకు నేపాల్ ప్రభుత్వం అనుమతించలేదు. ఈ కారణంగా ఇరు దేశాల మధ్య చాలా కాలం వరకు దౌత్య సంబంధాలు నిలిచిపోయాయి. -
‘మీరు లేనిదే భారత చరిత్ర అసంపూర్ణం’
జనక్‌పూర్, నేపాల్ : కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఆయన అక్కడి మూడు హిందూ తీర్థాలయాలను సందర్శించనున్నారు. కాగా భారత ప్రధాని హోదాలో మోదీ నేపాల్ పర్యటనకు వెళ్లడం ఇది మూడోసారి. రామాయణ్ సర్క్యూట్ ప్రారంభం.. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో కలిసి మోదీ జెండా ఊపి నేపాల్- ఉత్తరప్రదేశ్‌ల మధ్య బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎన్నో శతాబ్దాలుగా జనక్‌పూర్-అయోధ్యల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, ఈ బస్సు సర్వీసు ద్వారా ఆ బంధం మరింత బలపడనుందని వ్యాఖ్యానించారు. నేపాల్- భారత్‌ల మధ్య మతపరమైన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీసును ప్రారంభించినట్టు సమాచారం. రామాయణ్ సర్క్యూట్ థీమ్‌లో భాగంగా భారత్‌లోని అయోధ్య, నందిగాం, హంపి, నాగ్‌పూర్‌తో సహా 15 ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించనున్నారు.నేపాల్ రాజధాని ఖట్మాండూ నుంచి 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనక్‌పూర్ సీతమ్మ వారి జన్మస్థానంగా ప్రసిద్ధికెక్కింది. కాగా అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(రామ జన్మభూమిగా ప్రసిద్ధి) వరకు రామాయణ్ సర్క్యూట్ పేరిట బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి. నేపాల్ లేకుండా భారత చరిత్ర అసంపూర్ణం.. బస్సు సర్వీసు ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ పొరుగు దేశం నేపాల్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నేపాల్ లేకుండా భారత్ విశ్వాసం, చరిత్ర అసంపూర్ణమంటూ వ్యాఖ్యానించారు. నేపాల్ లేనిదే భారత ఆలయాలు, మా రాముడు కూడా అసంపూర్ణమేనంటూ మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. మోదీ నేపాల్ పర్యటన విశేషాలు... 1. మోదీ పర్యటన సందర్భంగా.. ఇరుదేశాలకు చెందిన సుమారు 11 వేల మంది భద్రతా సిబ్బంది తమ సేవల్ని అందిస్తున్నారు. 2. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలితో మోదీ శుక్రవారం భేటీ కానున్నారు. అనంతరం నేపాల్ అధ్యక్షుడు, ఇతర ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై చర్చలు జరపనున్నారు. తర్వాత ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. 3. శనివారం రోజున థరంగ్ లా కొండ పాదాల చెంతనున్న ముక్తినాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం.. ఆ ఆలయ అభివృద్దికి భారత్ అందించనున్న సాయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. 4. తూర్పు నేపాల్‌లోని శంకువసభ జిల్లాలో జలవిద్యుత్ ప్రాజెక్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వానికి చెందిన సట్లేజ్ జల్ విద్యుత్ నిగమ్ నిర్మించనుంది. -
శివాగ్రహమా?
-
నేపాల్‌లో చిరంజీవి పూజలు
చిరంజీవి తన జన్మదిన వేడుకలను శుక్రవారం నేపాల్‌లో ఘనంగా జరుపుకున్నారని సమాచారం. ఈ సందర్బంగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి స్థానిక పశుపతి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్మదిన వేడుకులు నేపాల్ జరుపుకునేందుకు చిరంజీవి ముందుగానే ఆయన కుటుంబ సభ్యులతో కలసి నేపాల్ చేరుకున్నారు. మరోవైపు చిరంజీవి జన్మదిన వేడుకలు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో ఈ వేడుకలను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుమారుడు హీరో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరణ్ తేజ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించారు. -
పశుపతికి మోడీ పూజలు
కఠ్మాండు: ప్రధాని మోడీ సోమవారం శ్రావణాష్టమి సందర్భంగా నేపాల్‌లోని ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రూ.2 కోట్ల విలువైన రెండున్నర టన్నుల చందనాన్ని సమర్పించారు. గుడిలో దైవకృపకు పాత్రుడినైనట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. మోడీ పశుపతికి నిర్వహించిన రుద్రాభిషేకం, పంచామృత స్నానంలో 150 మంది పూజారులు పాల్గొన్నారు. దక్షిణ భారతానికి చెందిన ప్రధాన అర్చకుడు గణేశ్ భట్ట భారత ప్రధానికి ప్రసాదాలు అందించారు. ‘ఈ ఆలయం విశిష్టమైనది. పశుపతి, కాశీ విశ్వనాథుడు ఒకరే. భారత్, నేపాల్‌లను ఏకం చేస్తున్న పశుపతి ఆశీర్వాదాలు ఇరు దేశాల ప్రజలకు ఇకముందూ అందాలి’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆలయంలో యాత్రికుల కోసం రూ. 25 కోట్లతో సత్రాన్ని నిర్మిస్తామన్నారు. -
పశుపతినాథ్ ఆలయంలో మోడీ పూజలు
ఖాట్మాండ్ : నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సుమారు గంటపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మోడీకి తీర్థప్రసాదాలు అందచేశారు. మోడీ రాక సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇక నరేంద్ర మోడీ తన పర్యటనలో భాగంగా నేపాల్‌కు 10 వేల కోట్ల(నేపాల్ రూపాయలు) రాయితీయుత రుణాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఖాట్మాండ్లో పలు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మోడీ నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నందున రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.