ఖాట్మాండ్ : నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సుమారు గంటపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మోడీకి తీర్థప్రసాదాలు అందచేశారు. మోడీ రాక సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇక నరేంద్ర మోడీ తన పర్యటనలో భాగంగా నేపాల్‌కు 10 వేల కోట్ల(నేపాల్ రూపాయలు) రాయితీయుత రుణాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఖాట్మాండ్లో పలు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మోడీ నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నందున రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.