కఠ్మండ్ : 18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు బుధవారం నేపాల్ రాజధాని కఠ్మండ్లో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆయన నిన్నే కఠ్మండ్ చేరుకున్నారు. సార్క్ శిఖరాగ్ర సదస్సులో కీలక రంగాల్లో ప్రాంతీయ సహకార విస్తృతిపై కూలంకషంగా చర్చ సాగనుంది.
నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఎనిమిది దేశాల అధినేతలు హాజరు అయ్యారు. సదస్సుకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు సదస్సు ముగింపు కార్యక్రమం అనంతరం భారత్, పాకిస్తాన్ ప్రధానులు మోదీ, నవాజ్ షరీఫ్ భేటీ కానున్నట్లు సమాచారం.