SAARC summit
-
బిమ్స్టెక్తో ముందుకు!
న్యూఢిల్లీ: దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం(సార్క్)తో కొన్ని సమస్యలున్న నేపథ్యంలో బిమ్స్టెక్ దేశాల సాయంతో ప్రాంతీయ సహకారాన్ని మెరుగు పరుచుకునేందుకు భారత్ కృషి చేస్తుందని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. గడిచిన ఐదేళ్లలో అంతర్జాతీయంగా భారత్ స్థాయి పెరిగిందని ప్రజలు గుర్తించారని, అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అధికారమిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా సంభవించిన పరిణామాలు మారిన సమీకరణాలతో చైనా ప్రాముఖ్యం పెరిగిందని, అదేవిధంగా భారత్ పలుకుబడి కూడా విస్తరించిందని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) గురువారం ఇక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ప్రాంతీయ అనుసంధానతకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. అయితే, సార్క్‌తో సమస్యలున్నాయి. అదేమిటో మనందరికీ తెలుసు. ఉగ్రవాద అంశాన్ని పక్కన పెట్టినప్పటికీ అనుసంధానత, వాణిజ్యం వంటి వాటిల్లోనూ ఇబ్బందులున్నాయి. అందుకే ఆర్థిక అభివృద్ధికి, ప్రాంతీయ సమగ్రతకు సార్క్ కంటే బిమ్స్‌టెక్‌నే కీలకంగా భావిస్తున్నాం’ అని తెలిపారు. డబ్లు్యటీవో ఆశించిన ఫలితాలను ఇవ్వనందునే పలు దేశాలు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందా(ఎఫ్‌టీఏ)లను కుదుర్చుకునేందుకు చొరవచూపుతున్నాయని తెలిపారు. బిమ్స్టెక్లో బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్ ఉన్నాయి. -
సార్క్ సదస్సుకు భారత్ వెళ్లదు: సుష్మ
హైదరాబాద్: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను విరమించేంత వరకు ఆ దేశంతో చర్చలు ఉండవని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగే దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) సదస్సుకు భారత్ హాజరు కాబోవడం లేదని ఆమె చెప్పారు. సార్క్ సదస్సు కోసం పాక్‌కు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపుతామని పాక్ విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. హైదరాబాద్‌లో బుధవారం సుష్మ మాట్లాడుతూ ‘ఆ ఆహ్వానం అందింది. కానీ మేం సానుకూలంగా స్పందించాలనుకోవడం లేదు. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పాక్ విడిచిపెట్టకుంటే ఆ దేశంతో చర్చలు ఉండవని నేను గతంలోనే చెప్పాను. సార్క్ సదస్సుకు కూడా భారత్ హాజరవ్వదు’ అని చెప్పారు. -
సార్క్ సదస్సు : మోదీని ఆహ్వానించనున్న పాక్
ఇస్లామాబాద్ : భారత్-పాకిస్తాన్ల మధ్య దెబ్బతిన్న సంబంధాల బలోపేతానికి చొరవ తీసుకునేందుకు పాకిస్తాన్ సన్నద్ధమైంది. సార్క్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది. సార్క్ సదస్సులో పాల్గొనాలని ప్రధాని మోదీని పాక్ లాంఛనంగా ఆహ్వానించనుంది. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతనిధి మహ్మద్ ఫైసల్ ఈ మేరకు వెల్లడించినట్టు డాన్ పత్రిక పేర్కొంది. భారత్-పాకిస్తాన్ల మధ్య నిర్మాణాత్మక సంప్రదింపుల కోసం పాకిస్తాన్‌కు రావాలని ఆహ్వానిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని మోదీకి రాసిన లేఖ నేపథ్యంలో దానికి కొనసాగింపుగా సార్క్ భేటీకి ఆహ్వానించేందుకు పాక్ సంసిద్ధమైంది. ఇమ్రాన్ లేఖలో భారత్‌తో స్నేహపూరిత సంబంధాలకు పాక్ తీసుకుంటున్న చొరవ, ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలకు దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి చేపట్టిన కృషిని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పటిష్ట సార్క్ కోసం వాజ్‌పేయి తపించిన తీరును ఇమ్రాన్ ప్రస్తావించారు. సార్క్ సదస్సులో పాల్గొనడం ద్వారా పాక్‌ను సందర్శించే అవకాశం లభించడంతో పాటు ఇరు దేశాల మధ్య నిలిచిన చర్చల పునరుద్ధరణకు మార్గం సుగమం అవుతుందని లేఖలో ఇమ్రాన్ పేర్కొన్నారు. కాగా భారత్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులతో 2016లో పాక్ నిర్వహించే సార్క్ సదస్సు నుంచి భారత్ వైదొలగినప్పటి నుంచి ఇంతవరకూ సార్క్ సదస్సు జరగకపోవడం గమనార్హం. భారత్ ఇస్లామాబాద్ సార్క్ భేటీ నుంచి తప్పుకోవడంతో బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్‌లు కూడా వైదొలిగాయి. -
మోదీకి లేఖ రాసిన పాక్ ప్రధాని : కీలాంకాశాల ప్రస్తావన
న్యూఢిల్లీ : ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తేదీ ఖరారు చేయండంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీని కోరారు. పాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మోదీ ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాశారు. అందుకు బదులుగా ఇమ్రాన్ మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. త్వరలోనే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్, మోదీని కోరారు. అంతేకాక రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించాలన్నారు. త్వరలోనే సార్క్ సదస్సును పాకిస్తాన్లో నిర్వహించేలా చూడలాని.. ఇందుకు భారత దేశం తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇమ్రాన్, అభ్యర్ధించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 20వ సార్క్ సదస్సు శ్రీలంకలో జరగనుంది. 2016లో సార్క్ సదస్సు పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉంది. జమ్ముకశ్మీర్ యురి సెక్టార్ లోని ఆర్మీ స్థావరంపై టెర్రిరిస్ట్ ల దాడి భారత్ తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక దేశాలు సార్క్ సదస్సుకు హాజరుకాలేమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పాక్‌లో సార్క్ సదస్సు పాక్‌లో నిర్వహించడానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఇమ్రాన్ కోరారు. ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లి (యుఎన్‌జిఎ) సమావేశాలకు హాజరయ్యేందుకు గాను న్యూయార్క్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సుష్మ స్వరాజ్ సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల అనధికార సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం గురించి చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది. అన్ని అనుకూలిస్తే ఈ సమావేశం సార్క్ సదస్సుకు ఒక రోజు ముందు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
సార్క్‌పై చర్చలు జరుపుతాం
కఠ్మాండు: సార్క్ సమావేశాలను నిర్వహించేలా సభ్య దేశాలతో చర్చలు జరుపుతామని కూటమి అధ్యక్ష దేశం నేపాల్ తెలిపింది. ఈ మేరకు అన్ని చర్యలు చేపడతామని విదేశాంగ మంత్రి ప్రకాశ్ శరణ్ మహత్ చెప్పారు. అన్ని సభ్య దేశాలు సున్నితంగా వ్యవహరిస్తూ ఇందులో పాల్గొనాలని కోరారు. సమావేశాలు నిర్వహించడానికి అవసరమైర సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత సభ్య దేశాలపై ఉందని పేర్కొన్నారు. అన్ని సభ్యదేశాలతో 19వ సార్క్ సదస్సు విజయవంతం చేసేందుకు సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. తమ భూభాగాలను సరిహద్దు తీవ్రవాద కార్యకలాపాలకు వేదిక కాకుండా చూడాలని సభ్య దేశాలను నేపాల్ కోరింది. కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి నేపథ్యంలో సార్క్ సదస్సులో పాల్గొనబోమని భారత్ ప్రకటించింది. మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక దేశాలు విరమించుకోవడంతో సదస్సు వాయిదా పడడం తెలిసిందే. -
పాకిస్థాన్‌కు మరో షాక్
ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్‌ను ఏకాకికి చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సార్క్ సభ్య దేశాలను తమ వైపుకు తిప్పుకోవడంలో భారత్ విజయవంతమైంది. పాకిస్థాన్‌లో జరిగే సార్క్ సదస్సును బహష్కరిస్తున్నట్టు మాల్దీవులు ప్రకటించింది. ఇంతకుముందు భారత్ సహా బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక బాయ్‌కాట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సార్క్ సభ్య దేశాల్లో పాక్ ఏకాకి అయ్యింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో పాకిస్థాన్‌లో సార్క్ సదస్సు జరగాల్సివుంది. కాగా ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం ఈ సదస్సులో పాల్గొనబోమని భారత్ ప్రకటించింది. అంతేగాక ప్రపంచ దేశాల్లో పాక్‌ను ఒంటరి చేసేందుకు ప్రయత్నించింది. ప్రపంచ దేశాలు ఉడీ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ భారత్‌కు బాసటగా నిలిచాయి. ఇక దక్షిణాసియా దేశాలు కూడా ఏకతాటిపై నిలిచాయి. భారత్ బాటలోనే అప్ఘాన్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు.. సార్క్ సదస్సును బహిష్కరించాయి. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమిలో మొత్తం ఎనిమిది దేశాలున్నాయి. సార్క్‌లో భారత్, పాకిస్థాన్, నేపాల్, అప్ఘాన్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు సభ్య దేశాలు. గత సార్క్ సమావేశం 2014లో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇస్లామాబాద్ లో జరగాల్సిన 19వ సార్క్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. -
సార్క్ సదస్సును వాయిదా వేసిన పాక్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఈ ఏడాది నవంబర్ లో ఇస్లామాబాద్ లో జరగనున్న 19వ సార్క్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో సదస్సును నిర్వహించబోయే తేదీలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. సమావేశాన్ని తేదీల మార్పుకు కారణం భారతేనని ఆరోపించింది. సదస్సులో పేదరికంపై చర్చించాల్సివున్నా దాన్ని కాదని భారత్ సదస్సును బహిష్కరించిందని విమర్శించింది. భారత్ తో పాటు సభ్యదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంకలు సదస్సులో పాల్గొనడం కుదరదని ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుండటంతో ఆ దేశంలో జరిగే సదస్సు హాజరుకాలేమని ఈ నెల 27న భారత్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. -
పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన శ్రీలంక
-
పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన శ్రీలంక
కొలంబో: టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్‌కు తాజాగా శ్రీలంక కూడా షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ వేదికగా ఇస్లామాబాద్‌లో జరగనున్న సార్క్ సమావేశాలకు వెళ్లకూడదని శ్రీలంక నిర్ణయించింది. ఈ మేరకు లంక విదేశాంగ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన చేసింది. దీంతో ఇప్పటివరకూ సార్క్ సదస్సుకు గైర్హాజరు అవుతున్న దేశాల సంఖ్య అయిదుకు చేరింది. తీవ్రవాదంపై పోరులో భారత్‌కు బాసటగా నిలిచిన బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్ దేశాలు సార్క్ సమ్మిట్‌కు హాజరయ్యేది లేదని స్పష్టం చేశాయి. నవంబర్ 9, 10 తేదీలలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా సార్క్ సమ్మిట్ జరుగనున్న విషయం తెలిసిందే. కాగా ప్రేరేపిత ఉగ్రవాదం, హింసను వ్యతిరేకించడంతో పాటు తాజా పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే ప్రయత్నంలో తొలి అడుగుగా సార్క్ దేశాల స్థాయిలో ఆ మేరకు భారత్ విజయం సాధించినట్లుగానే భావించవచ్చు. అయితే సదస్సుకు తాము హాజరయ్యేది లేదని అయిదు దేశాలు స్పష్టంగా చెప్పినా.. ప్రస్తుతం సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ మాత్రం.. సరైన సమయానికే ఈ సదస్సు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సభ్యదేశాలన్నీ సహకరించాలని గట్టిగా కోరింది. భారత్‌తో పాటు వరుసపెట్టి బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్ కూడా వివిధ కారణాలతో తాము ఇస్లామాబాద్‌లో జరిగే సదస్సుకు హాజరు కాబోమని తెలిపాయి. దాంతో ఇక ఆతిథ్య దేశం పాకిస్థాన్‌తో పాటు కేవలం మాల్దీవులు, నేపాల్ మాత్రమే ఆ సదస్సులో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. నేపాల్ సార్క్ అధ్యక్ష హోదాలో ఉన్నందున వెళ్లకుండా ఉండలేదు. అలాగే మాల్దీవుల నిర్ణయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అసలు ఏ ఒక్క సభ్య దేశం రాకపోయినా సదస్సు వాయిదా వేయాల్సిందే. -
సార్క్ సదస్సు బహిష్కరణపై టాటా ఏమన్నారు..
ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో సార్క్ సదస్సును బహిష్కరించాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రశంసించారు. ''సార్క్ సమావేశాన్ని బహిష్కరించాలన్న భారత ప్రభుత్వ స్థిర నిర్ణయం, సభ్య దేశాలు కూడా అందుకు మద్దతివ్వడం చూస్తే చాలా గర్వంగా ఉంది'' అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఇప్పటివరకు 10 వేల లైకులు రాగా, 6,800 మందికి పైగా దాన్ని రీట్వీట్ చేశారు. జమ్ము కశ్మీర్‌లోని ఉడీ ప్రాంతంలో భౄరత సైనిక శిబిరంపై పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు 18 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న దారుణ ఘటన తర్వాత భారత్ - పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాంతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సదస్సు నుంచి తప్పుకొంటున్నట్లు భారతదేశం ప్రకటించింది. ఆ వెంటనే బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్ కూడా తాము సదస్సులో పాల్గొనేది లేదని తెలిపాయి. అయితే ఎలాగైనా సదస్సు నిర్వహించాలని ప్రస్తుతం సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ భావిస్తోంది. So proud of Indian govt's firm stand on bycot of SARC mtg & overwhelming support by member nations. — Ratan N. Tata (@RNTata2000) 28 September 2016 -
సమయానికే సార్క్ సదస్సు నిర్వహిస్తాం
భారత్ సహా నాలుగు దేశాలు తాము హాజరయ్యేది లేదని స్పష్టంగా చెప్పినా.. ప్రస్తుతం సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ మాత్రం.. సరైన సమయానికే ఈ సదస్సు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సభ్యదేశాలన్నీ సహకరించాలని గట్టిగా కోరింది. ఈ మేరకు బుధవారం రాత్రి తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీచేసింది. నవంబర్ 9, 10 తేదీలలో ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్సు జరిగేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పరచాలని అందులో తెలిపింది. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సదస్సుకు హాజరయ్యేది లేదని భారతదేశం ముందుగా స్పష్టం చేసింది. ఆ తర్వాత వరుసపెట్టి బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్ కూడా వివిధ కారణాలతో తాము ఇస్లామాబాద్‌లో జరిగే సదస్సుకు హాజరు కాబోమని తెలిపాయి. దాంతో ఇక ఆతిథ్య దేశం పాకిస్థాన్‌తో పాటు కేవలం శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ మాత్రమే ఆ సదస్సులో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. అయితే అసలు ఏ ఒక్క సభ్య దేశం రాకపోయినా సదస్సు వాయిదా వేయాల్సిందే. ప్రస్తుత పరిస్థితిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని నేపాల్ ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. అయితే, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా నేపాల్ ఎందుకింతలా పట్టుబడుతోందన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. -
పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదు: ముషార్రఫ్
న్యూఢిల్లీ: సింధు నది నుంచి తమ దేశానికి నీళ్లు రాకుండా భారత్ అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ హెచ్చరించారు. ప్రతిఘటిచేందుకు సిద్ధంగా ఉంటామని ‘ఇండియా టుడే’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నీళ్లపై నియంత్రణతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భారత్ తో తలపడాలని తాము కోరుకోవడం లేదని, శాంతిప్రక్రియ ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు పర్యటనలు ఎల్లప్పుడు సమస్యలను పరిష్కరించలేవని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాకిస్థాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ముషార్రఫ్ ఈ వ్యాఖ్య చేశారు. ప్రతిదానికి పాకిస్థాన్ ను నిందించడం సరికాదన్నారు. ఉడీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడికి పాకిస్థాన్ కారణమంటూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో సుష్మా స్వరాజ్ ప్రసంగం డాబుసరిగా ఉందని విమర్శించారు. సార్క్ సమావేశాల నుంచి భారత్ తప్పుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. భారత్ ప్రభావితం చేయడం వల్లే అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ కూడా సార్క్ సదస్సుకు దూరమయ్యాయని ఆరోపించారు. బలూచిస్థాన్ లో పాకిస్థాన్ జాతీయ పతకాలను తగులబెట్టిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. -
సార్క్ సదస్సులో భారత్ పొల్గొనదు!
-
సార్క్ సదస్సులో భారత్ పొల్గొనదు!
త్వరలో జరగనున్న సార్క్ సమావేశాలకు భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. భారత్ బాటలో బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్తాన్ కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు సార్క్ దేశాలు ఈ సమావేశాలకు దూరం కావడం పాక్ కు నిజంగానే పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన ఉడీ ఉగ్రదాడికి నిరసగా భారత్ సార్క్ సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు విదేశాంగశాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సార్క్ సమావేశాలు వచ్చే నవంబర్ లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్ కు బుద్ధిచెప్పాలంటే ఇలాంటి చర్యలకు సిద్ధమవ్వాలన్నట్లు కేంద్రం సంకేతాలు పంపింది. భవిష్యత్తులో దౌత్యపరంగా దాయాది పాక్ కు ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఉగ్రవాది అమరుడు కాలేడు
• ఆ విషయం పాక్‌కు చెప్పాం: పార్లమెంటులో రాజ్‌నాథ్ వెల్లడి • ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్సు వివరాలపై ప్రకటన • పాక్‌లో తనకు సరైన ఆతిథ్యం ఇవ్వలేదని విమర్శ న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో హతమైన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వాని ఉదంతం నేపథ్యంలో.. ఒక దేశంలో ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి మరో దేశానికి అమరవీరుడు కాలేడని పాకిస్తాన్‌కు స్పష్టం చేసినట్టు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. ఉగ్రవాదులను కీర్తించడం, ప్రోత్సహించడం మానుకోవాలని సార్క్ దేశాలను కోరినట్టు చెప్పారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశానికి తాను హాజరైన అంశంపై రాజ్‌నాథ్ శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో సుమోటోగా ప్రకటన చేశారు. బుర్హాన్‌ను అమరవీరుడిగా, దేశ భక్తుడిగా పాక్ కీర్తించటం.. దానిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదిని అమరవీరుడిగా కీర్తించటం తగదని పాక్‌కు చెప్పినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. సార్క్ సదస్సులో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మనుషుల క్రయవిక్రయాల అంశాలపై చర్చించారని, చాలా దేశాలు అన్ని రూపాల ఉగ్రవాదాన్నీ ఖండించాయని చెప్పారు. నేర విషయాలపై సహకారానికి సంబంధించి సార్క్ సదస్సు తీర్మానాన్ని పాక్ ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాలపై త్వరలో చర్యలు చేపడతామని పాక్ చెప్పిందని.. ఆ ‘త్వరలో’ అనేది నిజంగానే త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. ఉగ్రవాదం పట్ల మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం అంటూ వివక్ష చూపొద్దన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న లేదా మద్దతిస్తున్న రాజ్య, రాజ్యేతర శక్తులపై అన్ని సమర్థవంతమైన చర్యలూ చేపట్టటం అవసరమన్నారు. ఉగ్రవాదులపై ప్రపంచ సమాజం విధించిన ఆంక్షలు, నిషేధాలను గౌరవించాలని సార్క్ మంత్రులకు తాను సూచించినట్లు చెప్పారు. అలాగే.. ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థ మెరుగుదల కోసం నిఫుణుల కమిటీ భేటీని ఈ ఏడాది సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. విందు కోసం వెళ్లలేదు.. పాక్ హోమంత్రి సార్క్ సదస్సుకు వచ్చిన అందరినీ విందుకు పిలిచిన మాట వాస్తమే అని.. తర్వాత ఆయన తన కారులో వెళ్లిపోవడంతో తానూ వెళ్లిపోయానని రాజ్‌నాథ్ చెప్పారు. పాక్‌లో తనకు సరైన ఆతిథ్యం ఇవ్వలేదన్నారు. అయితే విందు కోసం ఆ దేశానికి వెళ్లలేదంటూ దీనిపై ఫిర్యాదు చేయదలచుకోలేదని చెప్పారు. దీంతో సభ్యులు బల్లలపై చరుస్తూ మద్దతు తెలిపారు. సదస్సులో తాను ప్రసంగిస్తుండగా భారత మీడియాను అనుమతించలేదన్న ఎంపీల ప్రశ్నకు జవాబిచ్చారు. ‘ఆ అది లైవ్ టెలికాస్టా, కాదా.. అనేది తెలియదు. అయితే ఆ సమయంలో దూరదర్శన్, పీటీఐ, ఏఎన్ఐ ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదనేది వాస్తవం’ అని చెప్పారు. -
టాప్ లష్కరే టెర్రరిస్ట్ కలకలం
శ్రీనగర్: ఆందోళనలతో అట్టుడుకుతున్న కశ్మీర్ లో మరో కలకలం చెలరేగింది. లష్కరే తోయిబా ముఖ్య నాయకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబూ దుజాన్ బహిరంగ ప్రదేశంలో కనిపించాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆదివారం పుల్వామా జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో కశ్మీరీ యువకులతోపాటు కలిసి నడుస్తూ అబూ దుజాన్ వీడియోలకు చిక్కినట్లు తెలిసింది. నిఘావర్గాలు కూడా అబూ ఉనికిని నిర్ధారించారు. హిజబుల్ ఉగ్రవాది బుర్హాన్ వని అంత్యక్రియలకు కూడా అబూ హాజరైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా అతనికి సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో కశ్మీర్ లోయలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మరినట్లయింది. లష్కరేకు కశ్మీర్ చీఫ్ గా వ్యవహరిస్తూ, గడిచిన కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉంటోన్న అబూ దుజాన్ బహిరంగ ర్యాలీల్లో కనిపించడం వెనుక పెద్ద కుట్రే దాగుందని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న పాకిస్థాన్.. ఇక్కడి యువకులను తనవైపునకు తిప్పుకునేందుకు అబూ దుజాన్ లాంటి పెద్ద నాయకులను రంగంలోకి దింపింది. నేరుగా యువకలో మాట్లాడి, వారిని ప్రభావితం చేయగలితే ఉగ్రవాదాన్ని మరింత విస్తరించవచ్చన్నది అబూ దుజాన్ వ్యూహంగా కనిపిస్తున్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. బుర్హాన్ అంత్యక్రియలు సైతం లష్కరేకే చెందిన ఆమిర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరగడం గమనార్హం. రాజ్ నాథ్ పాక్ పర్యటనపై హెచ్చరికలు కశ్మీర్ అంశంలో పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ఉగ్రనాయకులు హఫీజ్ సయీద్(జమాత్ ఉల్ దవా), సయీద్ సలాహుద్దీన్(హిజబుల్ ముజాహిద్దీన్)లు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టారు. భారీ ర్యాలీలు, ఇస్లామాబాద్ లో భారత హైకమిషనర్ కార్యాలయం ముట్టడి తదితర ఆందోళనలు నిర్వహించినవారు.. తాజాగా భారత్ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పర్యటనను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. ఆదివారం జరిగిన ర్యాలీల్లో ప్రసంగించిన హఫీజ్, సలాహుద్దీన్ లు 'రాజ్ నాథ్ సింగ్ ను పాకిస్థాన్ లో అగుడు పెట్టనివ్వొద్దు' అని ప్రభుత్వాన్ని కోరారు. సైనిక బలంతో అమాయక కశ్మీరీలను చంపుతోన్న భారత్ తో ఎలాంటి చర్చలు వద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు పాక్ ప్రభుత్వం రాజ్ నాథ్ పర్యటనపై ప్రకటన చేసింది. 'ఆయన(రాజ్ నాథ్) సార్క్ సమావేశాల్లో పాల్గొని వెళ్లిపోతారు. భారత్- పాక్ ల మధ్య దైపాక్షిక చర్చలేవీ ఉండబోవు' అని ఆదివారం ఇస్లామాబాద్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఆగస్టు రెండో వారంలో జరగనున్న సార్క్ సమావేశాల్లో వీలైనన్ని మార్గాల్లో పాక్ తీరును ఎండగట్టేందుకు భారత్ సిద్ధపడుతోంది. పఠాన్ కోట్ దర్యాప్తు మొదలు కశ్మీర్ ఆందోళనలు, బుర్హాన్ వనిలపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలను ఎండగట్టేందుకు రాజ్ నాథ్ ప్రయత్నిస్తారని తెలుస్తోంది. -
'మీ విమానంలోనే ఉగ్రవాదులను తీసుకురండి'
ఝాన్సీ (యూపీ): వచ్చే సంవత్సరం సార్క్ సదస్సుకు పాకిస్థాన్ కు వెళుతున్న భారత్ ప్రధాని నరేంద్రమోదీ తిరిగి వచ్చేటప్పుడు ఆయన విమానంలోనే ఉగ్రవాదులను స్వదేశానికి తీసుకురావాలని ఉత్తర్ ప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఏవిధంగా ప్రత్యేక విమానంలో దేశం దాటారో.. అదే విధంగా వారందరిని భారత్‌కు తీసుకు రావాలన్నారు. ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందుకు హాజరైన అనంతరం ఆజం ఖాన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది సార్క్ సమావేశాలకు మోదీ పాక్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌లో తలదాచుకుంటున్న భారత మోస్టు వాంటెడ్ ఉగ్రవాదులను తిరిగి భారత్ తీసుకురావాలన్నారు. గత వారం నవాజ్ షరీఫ్ సార్క్ సమావేశాలకు మోదీని ఆహ్వానించగా దానికి ఆయన అంగీకరించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా, 1999లో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసి విమాన సిబ్బందితో పాటూ155 మందిని అఫ్ఘనిస్తాన్‌లోని ఖాందహార్ తరలించారు. అప్పుడు భారత ప్రభుత్వం వారితో చర్చించి.. బందీగా ఉన్న అత్యంత ప్రమాదకరమైన మౌలానా మసూద్ అజార్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను విడిచిపెట్టి, ప్రత్యేక విమానంలో దేశం నుంచి పంపించారు. ఈ నేపథ్యంలో ఆజం ఖాన్ పైవిధంగా వ్యాఖ్యానించారు. 26/11 ముంబై దాడిలో ప్రధాన సూత్రదారుడు జాకీర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వల్డ్ డాన్ దావుద్ ఇబ్రహింలను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో పాకిస్తాన్‌ని కోరుతుంది. -
పాకిస్తాన్ ఆగడాలు ఆగవా?
ఒక ప్రక్క కరచాలనం, మరొక పక్క కాల్పులు, సార్క్ సదస్సులో కరచాలనం చేసిన గంటల వ్యవధిలోనే బంకర్లలో చొరబడి, కాల్పులు జరపడం ఎంత వరకు సమంజసం? భారత సైనికుల తలలు నరికినప్పుడే గట్టిగా స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదికాదు. మనం ఎంత స్నేహభావం కోరుకుం టున్నా, మళ్లీ అదేపనిగా కాల్పులు జరపడం సరి హద్దులో చొరబాట్లు, హింసాయుత కవ్వింపు చర్య లు మామూలు అయిపోయాయి. మన శాంతి సందేశాలు చేతకానితనంగా భావిస్తున్న పాకిస్తాన్‌కు తగిన రీతిలో జవాబిస్తేనే కానీ, వ్యవహారం చక్క బడదు.’ కుక్కతోక వంకర’ అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహరించడం పట్ల దేశ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రక్క చర్చలు జరుపుతూ మరోప్రక్క కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్తాన్ ఆగడాలపై వెంటనే భారత సర్కారు సరైన రీతిలో జవాబు ఇవ్వకపోతే ఇంక ఎప్పటికీ ఈ సమస్య నివురుగప్పిన నిప్పు మాదిరిగానే రగులుతూ ఉంటుందన్నది అక్షర సత్యం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని చొరబాట్లు నిరోధించే దిశగా వెంటనే చర్యలు చేపట్టాలి. శొంటి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ -
అభివృద్ధి ఓ ఛాలెంజ్: మోదీ
-
మన ముందు ఎన్నో అవకాశాలున్నాయి: మోదీ
కఠ్మండ్ : పొరుగు దేశాల నుంచి సత్సంబంధాలు కోరుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కఠ్మండ్లో జరుగుతున్న సార్క్ శిఖరాగ్ర సదస్సులో ఆయన బుధవారం ప్రసంగించారు. పరస్పర సహకారంతో కలిసి నడుస్తున్న దేశాల సమాహారం సార్క్గా మోదీ అభివర్ణించారు. అభివృద్ధి ఓ చాలెంజ్ అని మోదీ వ్యాఖ్యానించారు. సహకారం పెరిగితే అభివృద్ధి సులభం అవుతుందన్నారు. ప్రాంతీయ సహకారం అవసరం ఎంతైనా ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయని దక్షిణాసియా దేశాలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సార్క్ దేశాల మధ్య సహకారం పెరిగితే మరోవైపు చూడాల్సిన అవసరం రాదన్నారు. మన మధ్య రోడ్లు, రైలు మార్గాలు అభివృద్ధి చెందాలన్నారు. విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని మోదీ పేర్కొన్నారు. ప్రజలు ఆశించినంతగా మనం ముందుకు వెళ్లడం లేదని ఆయన అన్నారు. యువతను మంచి దిశలో నడిపించాల్సి ఉందని, మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రాధాన్యత అని మోదీ తెలిపారు. -
18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం
కఠ్మండ్ : 18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు బుధవారం నేపాల్ రాజధాని కఠ్మండ్లో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆయన నిన్నే కఠ్మండ్ చేరుకున్నారు. సార్క్ శిఖరాగ్ర సదస్సులో కీలక రంగాల్లో ప్రాంతీయ సహకార విస్తృతిపై కూలంకషంగా చర్చ సాగనుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఎనిమిది దేశాల అధినేతలు హాజరు అయ్యారు. సదస్సుకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు సదస్సు ముగింపు కార్యక్రమం అనంతరం భారత్, పాకిస్తాన్ ప్రధానులు మోదీ, నవాజ్ షరీఫ్ భేటీ కానున్నట్లు సమాచారం.