సార్క్ సమావేశాలను నిర్వహించేలా సభ్య దేశాలతో చర్చలు జరుపుతామని కూటమి అధ్యక్ష దేశం నేపాల్ తెలిపింది.
కఠ్మాండు: సార్క్ సమావేశాలను నిర్వహించేలా సభ్య దేశాలతో చర్చలు జరుపుతామని కూటమి అధ్యక్ష దేశం నేపాల్ తెలిపింది. ఈ మేరకు అన్ని చర్యలు చేపడతామని విదేశాంగ మంత్రి ప్రకాశ్ శరణ్ మహత్ చెప్పారు. అన్ని సభ్య దేశాలు సున్నితంగా వ్యవహరిస్తూ ఇందులో పాల్గొనాలని కోరారు. సమావేశాలు నిర్వహించడానికి అవసరమైర సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత సభ్య దేశాలపై ఉందని పేర్కొన్నారు. అన్ని సభ్యదేశాలతో 19వ సార్క్ సదస్సు విజయవంతం చేసేందుకు సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. తమ భూభాగాలను సరిహద్దు తీవ్రవాద కార్యకలాపాలకు వేదిక కాకుండా చూడాలని సభ్య దేశాలను నేపాల్ కోరింది.
కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి నేపథ్యంలో సార్క్ సదస్సులో పాల్గొనబోమని భారత్ ప్రకటించింది. మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక దేశాలు విరమించుకోవడంతో సదస్సు వాయిదా పడడం తెలిసిందే.